వేడుకొందామా వేడుకొందామా…
వేడుకొందామా… వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా…వేడుకొందామా…
వేడుకొందామా…వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా… వేడుకొందామా…
వేడుకొందామా…
ఆమటి మ్రొక్కుల వాడే… ఆది దేవుడే
ఆమటి మ్రొక్కుల వాడే… ఆది దేవుడే
ఆమటి మ్రొక్కుల వాడే… ఆది దేవుడే
వాడు తోమని పళ్యాలవాడే… దురిత దూరుడే
వాడు తోమని పళ్యాలవాడే… దురిత దూరుడే
వాడు తోమని పళ్యాలవాడే… దురిత దూరుడే
వేడుకొందామా… వేడుకొందామా…
వేడుకొందామా… వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా…వేడుకొందామా…
వేడుకొందామా…
వడ్డీ కాసులవాడే… వనజనాభుడే
వడ్డీ కాసులవాడే… వనజనాభుడే
వడ్డీ కాసులవాడే… వనజనాభుడే
పుట్టు గొడ్రాన్డ్రకు
బిడ్డలిచ్చే గోవిందుడే
పుట్టు గొడ్రాన్డ్రకు
బిడ్డలిచ్చే గోవిందుడే
పుట్టు గొడ్రాన్డ్రకు
బిడ్డలిచ్చే గోవిందుడే
వేడుకొందామా… వేడుకొందామా…
వేడుకొందామా… వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా…
వేడుకొందామా… వేడుకొందామా
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగా…
వేంకటాద్రి నాధుడే
వాడు అలమేల్మంగా…
వేంకటాద్రి నాధుడే
వాడు అలమేల్మంగా…
వేంకటాద్రి నాధుడే
వేడుకొందామా… వేడుకొందామా…
వేడుకొందామా… వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా…వేడుకొందామా…
వేడుకొందామా… వేంకటగిరి
వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా… వేడుకొందామా…
________________
పాట : అన్నమాచార్య కీర్తన (Annamacharya Keerthana)
రాగం: జంఝరి
తాళం: ఆది
సంగీతం: శ్రీ గరిమెళ్ళ బాల కృష్ణ ప్రసాద్
సాహిత్యం: అన్నమాచార్య
గానం: శ్రీ రమేష్ & నిత్యా సంతోషి
👉ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!