వయ్యారి గోదారి నువ్వే
నా దారికే వచ్చి చెరావులే
నా వెంట నువ్వు నడిచి రావే
నూరేళ్లుంటా నీడల్లే
తెల్లారి సూరీడు నేనై
నీ అలలపై తేలుతున్నానులే
జన్మంతా ఈ జ్ఞాపకాలే
మోస్తూనే ఉంటాను లే
కాలమంతా కాస్త ఆగిపోతే
ఎంత బాగుంటుందే నిజంగా
నాతో పాటు నువ్వునందుకే
ఈ చోటుందే ఇంతందంగా
నిన్నే చూస్తూ ఈ ప్రాణమే పోతే పోనీ….
పిల్ల…. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్ల… ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్ల… చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా
పిల్ల… జంట గూవ్వోలె గుటికి ఏగిరోస్తున్నా
చందమామే చెంతనుంటే
మినుగురులే దేనికింక నా దారిలో
కళ్ళముందే కలలు ఉంటే
నిద్దురలే ఎందుకంట రాతిరేళలో…
గిర గిర గిర ఊహలన్నీ
నీ వైపు సాగగా
గడిచినదే రోజు చిన్న గడియలా
ముడిపడదని నీకు నాకు
అన్నావు ఎప్పుడో
కలిసే ఉన్నముగా…
పిల్ల…. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్ల… ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్ల… చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా
పిల్ల… జంట గూవ్వోలె గుటికి ఏగిరోస్తున్నా
మేఘమల్లే తేలిపోతూ
నిలకడగా ఉండదే నీ తీరు
ఎదుట ఉంటూ ఎదురు చూస్తూ
నీరందని నేలనై నేనున్నాను
చిటపటమని ఓ చినుకుల నువ్వు కరగవా
చిగురలనే తొడుగుతాను ప్రేమగా
పదపదమని తూనీగలా నన్ను చేరవా
నా లోకం నీవుగా
పిల్ల…. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా
పిల్ల… ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా
పిల్ల… చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా
పిల్ల… జంట గూవ్వోలె గుటికి ఏగిరోస్తున్నా
________________________
సాంగ్ : వయ్యారి గోదారి (Vayyari Godari)
సినిమా పేరు : లంబసింగి (Lambasingi)
గాయకుడు: జావేద్ అలీ (Javed Ali)
లిరిక్స్ : కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
మ్యూజిక్ : R R ధ్రువన్ (R R Dhruvan)
రచన & దర్శకుడు – నవీన్ గాంధీ (Naveen Gandhi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.