వయ్యారాల జాబిల్లి ఓని కట్టి
గుండెల్లోనా చేరావే గంటె కొట్టి
ఆ నండూరి వారేంకి మల్లి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
నదివలె కదిలా నిలబడక
కలలను వదిలా నిను వెతక
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదె
వయ్యారాల జాబిల్లి ఓని కట్టి
గుండెల్లోనా చేరావే గంటె కొట్టి
ఆ నండూరి వారేంకి మల్లి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
ని పరిచయమే ఓ పరవశమై
జగాలు మెరిసాను లే
నా ఎద గుడిలో ని అలికిడికి
పదాలు పలకవులే
ఆణువణువూ చెలిమి కొరకు
అడుగడుగు చెలికి గొడుగు
ఇది వరకు గుండె లయ కు
తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
వయ్యారాల జాబిల్లి ఓని కట్టి
గుండెల్లోనా చేరావే గంటె కొట్టి
ఆ నండూరి వారేంకి మల్లి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
ని ప్రతి తలపు నాకొక గెలుపై
చుగలు తొణికేనులే
ని శృతి తెలిపే కోయిల పిలుపే
తధాస్తు పలికేనులే
గగణముల మెరిసి మెరిసి
పవనముల మురిసి మురిసి
నినుకలిసే క్షణము తలచి
అలుపు అనే పదము మరచి
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
________________________
సాంగ్ : వయ్యారాల జాబిల్లి ఓని కట్టి
చిత్రం: తీన్ మార్
సంవత్సరం: 2011
లిరిక్స్ : రెహమాన్
గాయకులు: కారుణ్య
తారాగణం: కృతి కర్బందా, పవన్ కళ్యాణ్, త్రిష కృష్ణన్
సంగీత దర్శకుడు: మణి శర్మ
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.