Home » వన్నెలాడి టిక్కులాడి (Vanneladi Tikkuladi) సాంగ్ లిరిక్స్ |Janulyri| Mounika dimple

వన్నెలాడి టిక్కులాడి (Vanneladi Tikkuladi) సాంగ్ లిరిక్స్ |Janulyri| Mounika dimple

by Lakshmi Guradasi
0 comments
Vanneladi Tikkuladi song lyrics Janulyri Mounika dimple

Vanneladi Tikkuladi song lyrics

వన్నెలాడి ఓ టిక్కులాడి
ఆ.. వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఓ టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి యేలు బట్టి పోలుచుట్టే దాన్ని నేనే

నీ ఎత్తు చూపి వంపు చూపి వాడుకుకే
వాడ్ని వల్లో ఏసీ ఒళ్ళు రాసి దువ్వమాకే
ఛి ఛి సిచ్చులాడి సిన్నెలాడి సింపుకోకే
వాడి చిట్టి గుండే దోచుకున్న సిన్నదాన్నే

అరె వన్నెలాడి ఏమే టిక్కులాడి
అరెరే వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
పోవే టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి యేలు బట్టి పోలుచుట్టే దాన్ని నేనే

అబ్బా మాటకారి సూపునూరి మాయే సేయ్యకే
వాడ్ని ఎత్తుకెళ్ళి ఏదో ఒటి సెయ్యమాకే
సాల్లే అమ్మ కుచ్చి ఇడికొచ్చి ఆడుకోకే
వాడ్ని ఒడిసిపట్టి ఒళ్ళో పెట్టుకునే దాన్నే

ఓహో వన్నెలాడి ఆహా టిక్కులాడి
ఓసి వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఆహా టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి యేలు బట్టి పోలుచుట్టే దాన్ని నేనే

ఓ వగలాడి ఓంపులాడి చెయ్యి ఎయ్యకే
వానికి ఈడు జోడు కుదిరిన సిన్నదాన్నే
గోప్పులాడి నుప్పులాడి ముట్టుకోకే
మూడు ముళ్ళు నా మెళ్ళోన కట్టేటోడే

సైసే వన్నెలాడి ఇడిసే టిక్కులాడి
సైసు వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఇడిసే టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి యేలు బట్టి పోలుచుట్టే దాన్ని నేనే

వానికి దిష్టి పెట్టి మన్ను కొట్టి పట్టుకెళ్ళకే
వాన్ని గెద్దలాగా తన్నుకెళ్లి నవ్వమాకే
అసె పచ్చి గడ్డి పాల బుడ్డి మండిపోకే
వాడు మనసుపడ్డనంటేనే తిరిగినానే

అయి వన్నెలాడి ఓయి టిక్కులాడి
అయి వన్నెలాడి వన్నెలాడి మలుపుకోకే
వాడ్ని మందు పెట్టి మాక పెట్టి లగామకే
ఓ టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే
వాడి యేలు బట్టి పోలుచుట్టే దాన్ని నేనే

వన్నెలాడి ఓ టిక్కులాడి
వన్నెలాడి…

Song Credits:

సాంగ్ ; వన్నెలాడి టిక్కులాడి (VANNELADI TIKKULADI)
నిర్మాతలు: అనూష – అంజలి (ANUSHA – ANJALI)
సాహిత్యం: సురేష్ కడారి (SURESH KADARI)
గాయకులు: ప్రభ – లావణ్య (PRABHA – LAVANYA)
సంగీతం : వెంకట్ అజ్మీరా (VENKAT AJMEEERA)
కొరియోగ్రఫీ: శేఖర్ వైరస్ (SHEKAR VIRUS)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.