నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా
నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
ఓ తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా
నిన్ను చూడు మంకు చేసే మనసు
నన్ను నన్నుగా ఉన్న నీదే వెలుతూ
రెప్ప వేయక కన్ను నిన్నే తలచు
సెయ్యమాకే పిల్ల దేవదాసు.. దేవదాసు
ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా
నీ సిగలోన మొగిలి పువ్వులు
నీ తళుకులు తారాజువ్వలు
నువ్వు ఆడుతుంటే మోగే మువ్వలు
సిగ్గులొలికే నీ చేతి గాజులు.. గాజులు
ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా
నీ రూపు చూడని కన్నులు ఎందుకే
నీ పేరు తలవని పెదవులెందుకే
నీ నీడ తాకని దేహమెందుకే
నువ్వు లేకుంటే నా బతుకు బందుకే.. బందుకే
ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
ఓ సక్కని చుక్క చంద్రవంక
ఓసారి చూడవమ్మా నా వంక
నీ పక్కన నేను గోరువంక
చోటు ఇస్తే చాలు బతుకు నెలవంక.. నెలవంక
ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
ఓ తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా
Song Credits:
పాట: వన్నెలాడి (Vanneladi)
సాహిత్యం: కుమార్ కోటా (kumar kota)
సంగీతం: ఆడమ్స్ (Adams)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (hanmanth Yadav)
దర్శకుడు – బాలు SM (Balu SM)
నటీనటులు – అక్షిత్ మర్వెల్ (Akshith marvel), నీతూ క్వీన్ (Nithu queen)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.