వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా
సరసర రావే సరాసరి సునామీలా
చుట్టేశావు హడావిడిగా
ఓసినా గువ్వలా చెన్నా
ఊడిపడ్డ వెన్నెల వానా
తోడుకున్న తియ్యనీ తేనా
తననే తందానే తానా
పట్టుకోన మువ్వలా గున్నా
తేలుతున్న తెల్లనీ మైనా
ఆకతాయి అల్లరేదైనా
ఎక్కించేసైనా మేనా
వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా
ఒక్క చూపుని చూసి నీళ్ళల్లో తోసి నన్నే ముంచావే
నీ చేతితో తాకి కొత్తగ మళ్ళీ ఊపిరి పోసావే
పదపద పదమందే నీ వెనకే నా హృదయం
పదిమందెదురైనా నీ తోనే నా పయనం
ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే
పాదం కదిలిందే నీ వెంటే ఆగవే ఆగవే ఆగవే
పడిపడిపోయా ఓ పిల్లా నిన్నే చూసి
పంచ ప్రాణాలిస్తా నీకే పోగేసి
నీ పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే
నాలోకం దాటి నీలోకానికి తీసుకువచ్చిందే
మరి మరి మరిచేదే లేదసలు ఈ సమయం
మది నన్నే విడిచి నిను చేరే క్షణం
ఎటు చూస్తూ ఉన్నా కనిపిస్తావు నువ్వే
వెళ్ళిపోమాకే తిరిగి చూడవే చూడవే చూడవే
వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసాక భలే భలేగా
సరసర రా సరే సరాసరి సునామీలా
చుట్టేశావ హడావిడిగా
నేను నీ గువ్వలా చెన్నా
ఊడిపడ్డ వెన్నెల వాన
తోడుకో తియ్యనీ తేనా
తననే తందానే తానా
పట్టుకుంటె మువ్వ నేనేనా
తూలుతున్న తెల్లనీ మైనా
ఆకతాయి అల్లరేదైనా
ఎక్కేస్తా నేను మేనా
వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసానా భలే భలేగా….
————————–
సాంగ్ : వడివడిగా (Vadi Vadiga )
చిత్రం: ఇందువదన (Induvadana)
గాయకులు: జావేద్ అలీ (Javed Ali), మాళవిక (Malavika)
లిరిక్స్ : తిరుపతి జవానా (Tirupathi Jaavana)
నటీనటులు: వరుణ్ సందేశ్ (Varun Sandesh), ఫర్నాజ్ శెట్టి (Farnaz Shetty)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.