Home » ఉసురే పోయెనే (Usure Poyene) సాంగ్ లిరిక్స్ విలన్ 

ఉసురే పోయెనే (Usure Poyene) సాంగ్ లిరిక్స్ విలన్ 

by Lakshmi Guradasi
0 comments
Usure Poyene Song lyrics Villain

ఈ భూమి లోన ఎప్పుడంట నీ పుటక
నా బుద్ధి లోన నువ్వు చిచ్చుపెట్టాక
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన
ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా

ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా
ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైన
ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గు మంటే ఇంకా
ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా

ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ… ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

ఒంటికి మనసుకు ఆమడ దూరం, కలిపెదేట్టా తెలియదుగా
మనసేచెప్పే మంచి సలహా మాయశరీరం వినదుకదా

తపనే తొలిచే నా పరువము బరువు కదా
చిలిపి చిలకే మరి నను దరికి ఉబికేకడ
ఈ మన్మధ తాపం తీరున ఈ పూనకాల కోడిపెట్ట తీర్చున
ఈ మాయదారి మచ్చ తీర్చి మన్నిన్చేన
చందురుడు సూరీడు చుట్టి ఒక చోట చేరిపోయే
సత్యమసత్యము నేడు చికటింటి నీడలాయె

ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ… ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి
తను కాల్చుకోదు కళ్ళు లేని కట్టడిది
మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది
దాని బొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి

మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొగ్గలు విచ్చును తామర
దూరం భారం చూడనిదోకటే నీకు పుట్టిన ప్రేమరా
పాపం వేరా అన్న తేడా తెలియదులే
పామే ఐన ఇక వెనకడుగుండదులే
చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీ రూపే
నే మట్టి కలిసిన మదిలో నీవే

చందురుడు సూరీడు చుట్టి ఒక చోట చేరిపోయే
సత్యమసత్యము నేడు చికటింటి నీడలాయె

ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ… ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే
ఓ… ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి
అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

_______________________

చిత్రం : విలన్ (రావణ్) (2010)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : కార్తీక్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.