తులసి దళాలతో తుల తూచుద్దామంటే
రుక్మిణమ్మను నేను కానయ్య
ఓ వెంకటేశా అంత శక్తి నాకు లేదయ్యా
“తులసి దళాలతో”
వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే
పంతులయ్యని నేను కానయ్యా ఓ వెంకటేశా
అంత యుక్తి నాకు లేదయ్యా
“తులసి దళాలతో”
అందమైన పాట నీకు పాడదామనుకుంటే
అన్నమయ్యను నేను కానయ్యా
ఓ వెంకటేశా అంత గాత్రము నాకు లేదయ్యా
“తులసి దళాలతో”
ఏడుకొండలు నేను నడచి ఎక్కుదామంటే
నడవలేని వాణ్ని నేనయ్య
ఓ వెంకటేశా అంత శక్తి నాకు లేదయ్యా
“తులసి దళాలతో”
నిండు భక్తితో నిన్ను పూజిద్దామనుకుంటే
రామదాసు నేను కాదయ్యా
ఓ వెంకటేశా అంత భక్తి నాకు లేదయ్యా
“తులసి దళాలతో”
డబ్బు ఖర్చుపెట్టి నీకు పూజలు చేద్దామంటే
రారాజును నేను కాదయ్యా
ఓ వెంకటేశా అంత డబ్బు నాకు లేదయ్యా
“తులసి దళాలతో”
మనసారా గోవిందా అని నేను పలికితే
గోవిందా గోవిందా
నీ కరుణ చూప రావయ్యా
ఓ వెంకటేశా మమ్ములను బ్రోవ రావయ్యా
“తులసి దళాలతో”
See Also plz click on this: ammagaru-undedi-vaikuntam-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
