Home » వర్షాకాలంలో జిడ్డు చర్మం ని వదిలించే చిక్కులు ఇవే…

వర్షాకాలంలో జిడ్డు చర్మం ని వదిలించే చిక్కులు ఇవే…

by Rahila SK
0 comment

వర్షాకాలంలో ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గాలిలో ఉండే తేమ వల్ల వీరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. అందుకే వర్షాకాలంలో ఆయిల్ స్కీన్ ఉన్నవారు కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను అధిగమించవచ్చు. అవేంటో చుద్దాం…

వేడినీళ్లు: వేడినీళ్లతో ముఖం కడగడం వల్ల చర్మరంధ్రాలు, నూనె గ్రంథులు తెరుచుకుంటాయి. అందుకే ఈ కాలంలో ఆయిల్ స్కిన్ ఉన్నవారు చల్లని నీటితో ముఖాన్ని కడగండి.
టమాటో మసాజ్: టమాటో జ్యూస్ లో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకుని కొద్దిసేపటి తరువాత చల్లటినీటితో ముఖాన్ని కడగండి. టమాటో మసాజ్ మరియు నిమ్మరసం కలిపినా మిశ్రమంతో మీరు ఇలా చేస్తే మీ ముఖంపై ఉన్న జిడ్డుపోయి అందంగా మారుతుంది.
మిల్క్ మసాజ్: పాలు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వలన దమ్ము, ధూళిని తొలగించుకోవచ్చు.
బొప్పాయి మరియు పెరుగు: రెండు స్పూన్ ల బొప్పాయి గజ్జ, ఓ టేబుల్ స్పూన్ పెరుగు, ఒక స్పాన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాసి మసాజ్ చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. దీని వల్ల జిడ్డుతనం తొలిగిపోతుంది.
క్లెన్సర్: ఈ కాలంలో సోప్‌తో ముఖం కడగడం మానేయండి. దీని వల్ల చర్మం త్వరగా పొడిబారిపోతుంది. దానికి బదులు ఏదైనా ఫేష్ వాష్ లేదా క్లెన్సర్ ను ఉపయోగించండి.
దానిమ్మ: ఒక కప్పులో రెండు స్పూన్ల దానిమ్మ రసం, ఒక కప్పు ఓట్స్, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 స్పూన్ల మజ్జిగా వేసి ఆ మిశ్రమం మొత్తగా అయ్యాక ముఖానికి, చేతులకు రాసి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పాలు మరియు తేనె: పాలు మరియు తేనె మిక్స్ చేసి ముఖానికి మరియు రాచుకుంటే మీకు ఆయిల్ స్కీర్ సమస్య తగ్గుతుంది.
పెరుగు: ఆయిల్ స్కీర్ ఉన్నవారికి పెరుగు బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ సేల్స్ ను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచి మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచుతుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment