తెల్లారు పొద్దుల్లో
పల్లేరు పువ్వల్లె
గోదారి అంచుల్లో
గన్నేరు పువ్వల్లె
గుంతంగా ఉండదే కొండమల్లి
కోసుకోమంటుంది గిల్లి గిల్లి
అందంగా ఉన్నది అడమల్లి
అల్లుకోమంటుంది మళ్ళి మళ్ళి
తెల్లారు పొద్దుల్లో
పల్లేరు పువ్వల్లె
గోదారి అంచుల్లో
గన్నేరు పువ్వల్లె
పల్లక జెమ్మడిపళ్ళ రంగో పిల్ల
పట్టబోతే గుచ్చుకుంటే ఎలా
చెప్పకుండా చెయ్యి వేస్తే పిల్లగా
గుచ్చుకోదా మరి దొంగ ముళ్ళు
అరెరే తంగేడు పువ్వల్లె
తూలమాకే పిల్ల
తుమ్మెదై వాలితే తాలలేవే
జిల్లేడు పువ్వల్లె
జోరువద్దు పిల్లగా
పరువాల బరువంతా మోయలేవో
తెల్లారు పొద్దుల్లో
పల్లేరు పువ్వల్లె
గోదారి అంచుల్లో
గన్నేరు పువ్వల్లె
రేగుపళ్ళ కంటిచూపో పిల్లగా
రెప్ప వాల్చ కుండా చూస్తే ఎలా
పచ్చి పాల పల్లె పడుచో పిల్ల
రెచ్చగొడితే రెచ్చిపోనా ఇలా
గంజాయి మత్తల్లే ఎక్కినవో పిల్లగా
తూగుతున్న నన్ను హత్తుకోవో
మందార మొగ్గలే చిక్కినవో పిల్ల
ముద్దుల్లో ముంచేస్తే ఆగలేవో
తెల్లారు పొద్దుల్లో
పల్లేరు పువ్వల్లె
గోదారి అంచుల్లో
గన్నేరు పువ్వల్లె
గుంతంగా ఉండదే కొండమల్లి
కోసుకోమంటుంది గిల్లి గిల్లి
అందంగా ఉన్నది అడమల్లి
అల్లుకోమంటుంది మళ్ళి మళ్ళి
తెల్లారు పొద్దుల్లో
పల్లేరు పువ్వల్లె
గోదారి అంచుల్లో
గన్నేరు పువ్వల్లె
__________________________
పాట టైటిల్ – తెల్లారు పొద్దుల్లో (Thellaru Poddullo)
పాట: ప్రణయగోదారి (Pranayagodari)
గాయకులు – ధనుంజయ్ (Dhanunjay), అదితి బావరాజ్ (Adithi Bavaraj)
సాహిత్యం – మార్కండేయ (Markandeya)
సంగీతం: మార్కండేయ (Markandeya)
తారాగణం – సదన్ (Sadan), ప్రియాంక ప్రసాద్ (Priyanka Prasad)
దర్శకుడు: పిఎల్ విఘ్నేష్ (P L Vignesh)
నిర్మాత: లింగయ్య పరమళ్ల (Lingaiah Paramalla)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.