Home » తెల్ల తెల్ల వారంగ సీతాలు సాంగ్ లిరిక్స్ – Folk Song

తెల్ల తెల్ల వారంగ సీతాలు సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comments

తెల్ల తెల్ల వారంగ
తొలి మంచు ఉరవంగా ఎంత ముద్దుగున్నది
పిల్ల గడ్డి మొప్పులెత్తి
వయ్యారంగా పోతే మనసు ఆగకున్నది

కొలు కొలు పిల్ల కొలు కొలు
నువ్వు అవునంటే గిస్తానే మైల పోలు

కొలు కొలు పిల్ల కొలు కొలు
నువ్వు అవునంటే గిస్తానే మైల పోలు

బుల్లెట్టు బండెక్కి జోరుగా పోతుంటే
సూడ సక్కంగున్నావు
బావ హారన్ కొట్టి అగు అగు అంటే
నిలువలేకవున్నారు

ఆపు ఆపు పిల్లగా మాటాలపు
మాయమాటలతో మత్తు జల్లమాకు

ఆపు ఆపు పిల్లగా మాటాలపు
మాయమాటలతో మత్తు జల్లమాకు

తెల్ల తెల్ల వారంగ
తొలి మంచు ఉరవంగా ఎంత ముద్దుగున్నది
పిల్ల గడ్డి మొప్పులెత్తి
వయ్యారంగా పోతే మనసు ఆగకున్నది

పొద్దు తిరుగుడు పువ్వుల పిల్ల
రారమ్మని అంటున్నాయి
నా సుట్టు తిరుగుతు
నీ పేరు చెప్పి మారము చేస్తున్నాయి

సీతాలు పిల్ల సీతాలు
సిన్న చిరునవ్వు నవ్వవే బంగారు

సీతాలు పిల్ల సీతాలు
సిన్న చిరునవ్వు నవ్వవే బంగారు

కలువపూలు బావ కలిసి పోదామని
సైగలు చేస్తున్నాయి
ముట్టుకుందామంటే నీ పేరు చెప్పి
దెగ్గరకు రమ్మన్నవి

బావల్లో ముద్దు బావల్లో
నేను ఏమని చెప్పాలి ప్రేమల్లో

బావల్లో ముద్దు బావల్లో
నేను ఏమని చెప్పాలి ప్రేమల్లో

జోడు సిలకలు రెండు
కిల కిల పలకంగా
వినాసంపుగానున్నది

పిల్ల కోయిలమ్మాయ్
నువ్ పాట పాడంగా
శృతి కలపాలని ఉన్నదీ

గల గల నీ కాళి మువ్వల
సప్పుడిన్న నా పాణం అగును

గల గల నీ కాళి మువ్వల
సప్పుడిన్న నా పాణం అగును

జంట పైరుమోలే కలిసిపోవలనీ
కలలెన్నో నే కంటిని
ముచ్చటైన జంట అని
అందరూ అంటుంటే మనసు లాగుతున్నది

బావయ్యో నా బావయ్యో
నా యేలు పట్టే రోజు ఎప్పుడయ్యో

బావయ్యో నా బావయ్యో
నా యేలు పట్టే రోజు ఎప్పుడయ్యో

తెల్ల తెల్ల వారంగ
తొలి మంచు ఉరవంగా ఎంత ముద్దుగున్నది
పిల్ల గడ్డి మొప్పులెత్తి
వయ్యారంగా పోతే మనసు ఆగకున్నది

బుల్లెట్టు బండెక్కి జోరుగా పోతుంటే
సూడ సక్కంగున్నావు
బావ హారన్ కొట్టి అగు అగు అంటే
నిలువలేకవున్నారు

ఏడేడు సంద్రాలు ధాటి నీ కోసం
రావాలని ఉన్నదీ
పిల్ల ఒకరి ఒకరమై కలిసిపోవాలనే
ప్రేమెంతో నాకున్నది

కొలు కొలు పిల్ల కొలు కొలు
నువ్వు అవునంటే గిస్తానే మైల పోలు

కొలు కొలు పిల్ల కొలు కొలు
నువ్వు అవునంటే గిస్తానే మైల పోలు

అడుగుల్లో అడుగేసి ఏడు అడుగులు
నీతో నడవలని వున్నది
బావ పెనిమిటి నువ్వని
ఊరంతా చెప్పి పిలవలని ఉన్నది

బావయ్యో నా బావయ్యో
నా యేలు బట్టి నువ్వు రావయ్యో

బావయ్యో నా బావయ్యో
నా అడుగుల్లో తోడై రావయ్యో

_______________________________________

పాట: తెల్ల తెల్ల వారంగ సీతాలు (Thella Thella Varanga Seethalu)
నిర్మాత – అమృత (రజిత) (Amrutha (Rajitha))
సాహిత్యం – కె కృష్ణ (K krishna)
గాయకులు – కె కృష్ణ (K Krishna) & శ్రీనిధి (Srinidhi)
సంగీతం – వెంకట్ అజ్మీరా (Venkat Azmeera)
తారాగణం – యమునా తారక్ (Yamuna Tarak) & హన్మంత్ (Hanmanth)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment