నా చెయ్యే పట్టుకోవా
నన్నొచి చుట్టుకోవా
నాతోనే ఉండిపోవా…
కన్నుల్లో నిండిపోవా
గుండెల్లో పొంగిపోవా
నిలువెల్లా ఇంకిపోవా
ఓ చెలి కోపంగా చూడకే చుడకే
ఓ చెలి దూరంగా వెళ్ళకే…
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నాదే నీ ఊహనే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వెళ్ళిపోవొద్దే
నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చుస్తూ ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం
నాలో భారమంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం
నాలో మరణమంటే ఏమిటంటే నిన్ను మరవడం
ఓ చందమామ చందమామ ఒక్కసారి రావా
నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవా
మనవి కాస్త ఆలకించి ముడిపడవా….
నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై
బగ్గుమంటూ దూకుతున్నాయే నా మీదకి
నా ఊపిరే అందులోపడి కాలుతున్నదే
కొద్దిగైనా కబురుపెట్టు నవ్వుమేఘానికి
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నాదే నీ ఊహనే
నే నిన్ను చూడకుండ
నీ నీడ తాకకుండ
రోజులా నవ్వగలనా…
నీ పేరు పలకకుండ
కాసేపు తలవకుండ
కాలాన్ని దాటిగలనా…
గుండెలో ఎముందో కళ్ళలో చూడవా
నిన్నలా నాతోనే ఉండవా..
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నావే నా దారిని
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వెళ్ళిపోవొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వెళ్ళిపోవొద్దే
____________________
Song Credits:
సాంగ్ : తట్టుకోలేదే (Thattukoledhey)
డైరెక్షన్ స్టోరీ DOP ఎడిటింగ్ డి – వినయ్ షణ్ముఖ్ (Vinay shanmukh)
సంగీత స్వరకర్త & గాయకుడు – విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
లిరిక్స్ – సురేష్ బనిసెట్టి (SURESH BANISETTI)
నటీనటులు – దీప్తి సునైనా (Deepthi Sunaina), రాహుల్ వర్మ (Rahul Varma)
మహిళా గాయని: సింధూజ శ్రీనివాసన్ (Sindhuja srinivasan)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.