Home » తాండవ రూపం (Thandava Roopam) సాంగ్ లిరిక్స్ – Swag

తాండవ రూపం (Thandava Roopam) సాంగ్ లిరిక్స్ – Swag

by Lakshmi Guradasi
0 comments

లింగమూర్తి శరణం

లింగమూర్తి శరణం, శంభో
ఊరడించరా హృదయం

నీ దయరా ఈ జననం, దేహం
బూది చేయరా భేదం

మాతృ రూప స్త్రీలింగా
పితృ రూప పుంలింగా
సృష్టి రూప శ్రీ లింగా
ఙ్ఞాన రూప గోలింగా

సర్వ లింగ బ్రోవరా కావరా వేగ రా హరహరా

నీ దయారా ఈ జననం, దేహం
బూది చేయరా భేదం

కంటితడి కాశి గంగ ధార చేసినానురా
కనుపాపనే అఖండ జ్యోతి లింగమూర్తిగా

మహోన్నతంగా శుభాంగినై వేడినానీశ్వరా
మనోరథo ఫలించనీ సదా ఉమామహేశ్వరా

ఈ సృష్టి సౌందర్యాన్ని స్త్రీ మూర్తి గావించి
ప్రేమగా నీలోన నిలిపావురా

అర్ధనారీరూప నన్నేలగా రార
మదిని విధిని తెలిసి బలమిడరా

త్రై..

లింగమూర్తి శరణం, శంభో
ఊరడించరా హృదయం

నీ దయరా ఈ జననం, దేహం
బూది చేయరా భేదం

మాతృ రూప స్త్రీలింగా
పితృ రూప పుంలింగా
సృష్టి రూప శ్రీ లింగా
ఙ్ఞాన రూప గోలింగా

సర్వ లింగ బ్రోవరా కావరా వేగ రా హరహరా

______________________________

సంగీతం: వివేక్ సాగర్ (Vivek Sagar)
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavithula Ramalingeswara Rao)
గానం: కల్పనా రాఘవేందర్ (Kalpana Raghavendar)
నటీనటులు: శ్రీవిష్ణు (Sree Vishnu), రీతూ వర్మ Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine)
రచన మరియు దర్శకత్వం: హసిత్ గోలి (Hasith Goli)
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్ (T.G. Vishwa Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment