Home » అమ్మమ్మ నోట(తెలుగు సామెతలు)

అమ్మమ్మ నోట(తెలుగు సామెతలు)

by Manasa Kundurthi
0 comment

తెలుగు సామెతలు అనేవి మన తెలుగు భాష పుట్టినప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి. వీటిని చాలా సందర్భాలలో విరివిగా వాడుతారు. ఏదైనా ఒక సందర్భాన్ని గురించి ఒక వాక్యంలో చెప్పదలచినప్పుడు ఈ సామెతలను వాడుతారు. సామెతలలో మన తెలుగు భాష యొక్క సౌందర్యం అణువణువునా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ సామెతలు నీతికి సూచనగా హాస్యం కలగలిపి ఉంటాయి.

సామెతలు ఆయా ప్రాంతాల్లో భావాన్నిబట్టి భాషనుబట్టి చాలా రకాలుగా ఉన్నాయి. సామెతలు ఒకరి చేత రచించబడ లేదు అవి రోజువారి సంభాషణల నుంచి పుట్ట బడినవి. సామెత లేని మాట ఉప్పు లేని కూరవలె చప్పగా ఉంటుంది. సామెతలు ఏదైనా ప్రసంగానికి మరింత వన్నె చేకూరుస్తాయి.

ఇవి మన పూర్వీకులు మనకు ప్రసాదించిన అమృతపు రసగుళికలు. సామెతలను లోకోక్తులు, చలోక్తులు, హాస్యోక్తులు, రసోక్తులు అని రకరకాల పేర్లతో వీటిని పిలుస్తారు. ఇంగ్లీషులో వీటిని proverbs అని పిలుస్తారు. ఈ 100 తెలుగు సామెతలు  నేను మా అమ్మమ్మ, నాన్నమ్మ దగ్గర నుంచి సేకరించాను. ఈ సామెతలను వారు ఎప్పుడు వారి రోజువారి సంభాషణ లో ఉపయోగిస్తూ ఉంటారు.

telugu samethalu

నేను విన్న, సేకరించన కొన్ని సామెతలను, ఇప్పుడు మీ కోసం:

1. అగ్గిమీద గుగ్గిలం లాగా.

2. అచ్చేసిన ఆంబోతు వలె.

3. అడవిలో కార చిచ్చు.

4. అతి రహస్యం బట్ట బయలు.

5. అనుమానం పెనుభూతం.

6. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.

7. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.

8. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.

9. అదృష్టం బాగొకపోతే అరటిపండు తిన్న పన్ను విరిగిపోద్ధి.

10. అద్దం అబద్దం చెప్పదు.

11. అదిగో పులి అంటే ఇదిగో మేక.

12. అందితే జుట్టు అందకపొతే కాళ్ళు.

13. అందని ద్రాక్ష పుల్లన.

14. అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు.

15. ఆకాశానికి చిల్లు పడ్డడు.

16. ఆకాశం పై ఉమ్మి వేసినట్టు.

17. ఆస్తి మూరెడు ఆశ బారెడు.

18. అబద్దం ఆడిన అతికినట్టుండాలి.

19. అబ్యాసం కూసు విద్య.

20. అప్పుచేసి పప్పుకూడు.

21. అమ్మా పెట్టదు అడుక్కొనివ్వదు.

22. అయ్యకు లేక అడుక్కుతింటుంటే కొడుకొచ్చి కోడి పలావ్ అడిగాడట.

23. అన్ని దానాలలో విద్యా దానం గొప్పది.

24. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.

25. అరటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వెళ్ళి అరిటాకు మీద పడ్డా చిరిగేది అరిటాకే.

26. అర్థరాత్రి మద్దెల దరువు.

27. అయ్యోరు చేస్తే తప్పులేదు అమ్మోరు చేస్తే తప్పు. వదలమంటే పాముకి కోపం పట్టుకోమంటే కప్పకి కోపం.

28. అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.

29. ఆకాశానికి హద్దే లేదు.

30. ఆకాశమే నీ హద్దురా.

31. ఆకై మేకైనాడు.

32. ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా.

33. ఆటలో అరటిపండు.

34. ఆడవాళ్ళ నోటిలో నువ్వుగింజ నానదు.

35. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.

36. ఆడికి పోయినా రూపాయి పావలే ఈడికి పోయిన రూపాయి పావలే.

37. ఆరోగ్యమే మహా భాగ్యము.

38. ఆకలి వేస్తె రోకలి మింగమన్నాడంట.

39. ఆ కత్తికి పదునెక్కువ.

40. ఇల్లు అలగ్గానే పండగ కాదు.

41. ఇల్లు పీకి పందిరేసినట్లు.

42. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు.

43. ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే చుట్టగాల్చుకొను ఒకడు నిప్పడిగాడంట.

44. ఇల్లు పీకి పందిరి వేసి నట్టు.

45. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.

46. ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత.

47. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.

48. ఇంటింటా రామాయణం.

49. ఇంటిలో ఉన్నోడిని వీధిలో పెట్టినట్టు.

50. ఇంట్లో పులి వీధిలో పిల్లి.

51. చిక్కుతీసి కొప్పు పెట్టినట్టు.

52. ఇంటికి దీపం ఇల్లాలు.

53. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు.

54. ఇల్లు ఇరుగ్గా ఉండాలి, పెళ్ళాం కోతిలా ఉండాలి.

55. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.

56. ఇంటికి ఉట్టే లేదు నెత్తికి జుట్టు లేదు.

57. ఇంటి గుట్టు వీధిలోకి లాగినట్టు.

58. ఈతకు మించిన లోతేలేదు.

59. ఈ కత్తికి రెండు వైపులా పదునుంది.

60. ఉన్నదీ పొయ్యింది ఉంచుకుందీ పొయ్యింది.

61. ఉడుత సాయం.

62. ఊరంతా తిరిగి వాకిట్లో చచ్చినట్టు.

63. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా.

64. ఉరుములా వచ్చి మెరుపులా పోతాడు.

65. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.

66. ఊళ్ళో పెళ్ళికి అందరు పెద్దలే.

67. ఊపిరి ఉంటె ఉప్పు అమ్ముకుని బ్రతకవచ్చు.

68. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుకం లేదు.

69. ఎలుక తోకను తెచ్చి  ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు.

70. ఎర్రగడ్డ తొక్కు ఏడు బస్తాలు ఎగిరి తన్నా.

71. ఏమిరా పడ్డావ్ అంటే అదొక పల్టీలే అన్నాడంట.

72. ఎదవని దీవించుఅంటే నాలాగే వర్ధిల్లు అనిందంట.

73. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.

74. ఎవరికివారే యమునాతీరే.

75. ఎవడి గోల వాడిది.

76. ఎప్పుడూ ఎక్కడనోడు గుర్రం ఎక్కితే వెనక్కి ముందుకి కదిలిందంట.

77. ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి.

78. ఏడ్చే బిడ్డకి ఎలక్కాయ చూపించినట్టు.

79. ఏనుగు కుంబస్తలాన్ని కొట్టినట్టు.

80. ఏ గాలికి ఆ చాప.

81. ఏ రాయి అయితే ఏమి పళ్ళు రాలగొట్టుకొను.

82. ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు.

83. ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే మూడు పూట్ల తిన్నమ్మ మూర్ఛబోయిందంట.

84. ఒట్టు తీసి గట్టున పెట్టు.

85. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

86. కంచే చేను మేసినట్లు.

87. కత్తికి కందగడ్డ లోకువ.

88. కన్ను మిన్ను కానరాకపోవడం.

89. కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును.

90. కలిసొచ్చే కాలంవస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు.

91. కథ కంచికి చేరడం.

92. కర్ర ఇచ్చి పళ్ళు రాల గొట్టించుకోవడం.

93. కర్ర విరక్కుడదు పాము చావకుడదు.

94. కళ్యాణమొచ్చిన కక్కొచ్చిన ఆగదు.

95. కష్టే ఫలి.

96. కత్తిమీద సాము.

97. కలిమి కలిగినొడు భలం కలిగినొడు.

98. కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టు.

99. కాకి పిల్ల కాకికి ముద్దు.

100. కాటికి కాళ్లు చాపడం.

వీటితో పాటుగా మరికొన్ని సామెతలను సేకరించడం జరిగింది, అవి క్రింద ఇవ్వబడినవి:

  • ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి,
  • ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలు చూపుతారు
  • ఆడవారు అలిగినా అందమే
  • ఇచ్చినమ్మ ఈగ – పుచ్చుకున్నమ్మ పులి
  • ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
  • ఇచ్చేవి అందాలు పుచ్చుకునేవి తీర్థాలు అన్నట్లు
  • ఉత్తరాన మబ్బు పట్టితే వూరికే పోదు
  • ఉపాయాలున్నవాడు ఊరిమీద బ్రతుకుతాడు
  • ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
  • ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు.
  • అన్నం తిన్నవారు..తన్నులు తిన్నవారు మరిచిపోరంట.
  • సముద్రం కంటే సహనం పెద్ద.
  • అరచేతిలో వెన్న పెట్టుకుని…నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్లు.
  • ఉసిరికాయంత తగువు..ఊరికి తాటికాయంత అవుతుంది.
  • ఎంత పెద్ద గుమ్మడి కాయ అయినా..కత్తిపీట కి లోకువే.

ఇలాంటి మరిన్ని విశేషాల కోసం తెలుగు రీడర్స్ వెబ్సైటు ను సంప్రదించండి.

Leave a Comment