తమకమా తమదైన మైకమా
తపనలే సహజమా..
మనసులో మనదైన మగతలో
ఉండిపో ప్రియతమా..
నిలకడ లేని చిన్ని నీలి మేఘమా
నువ్వు వాన లాగా మారిపోకుమా
వెల్లువల్లే నన్ను చేరవా ఓ ప్రాణమా
అడుగులు చేరలేని వింత దూరమా
కలహాలు లేని ప్రేమ కావ్యమా
నన్ను మార్చిన కూర్చిన నా ప్రేమా
తెలియదే తెలియదే నాకే వివరమే తెలియదే
కుదురుగా ఉండదే మనసెంటో..
తెలియదే తెలియదే వయసా కలవరం ఎందుకే
కన్నులలో కలలలో నువ్వుంటే..
నువ్వలా నవ్వేసి వెళ్ళిపోతే
నా మదే చేజారే ఆలా
నా ప్రతి మాటల్లో నిండిపోతే
నా కథే మారిందే..
వెన్ను తట్టి నన్ను తాకిన.. చల్లగాలివో
వేలు పట్టి వెంట నడిచిన.. చంటి పాపవో
నాకు నేను రాసుకున్న ఓ ఉత్తరానివో
పట్టు తప్పి నన్ను చేరిన చెలి తారవో
తెలియదే తెలియదే నాకే వివరమే తెలియదే
కుదురుగా ఉండదే మనసెంటో..
తెలియదే తెలియదే వయసా కలవరం ఎందుకే
కన్నులలో కలలలో నువ్వుంటే..
నాదని నాకంటూ ఉన్నదంతా నీవని
నే చెప్పనా ఓ ఓ
నేనేలా ఆ చిన్ని మాట కోసం
ఎంతగా వేచి చూడనా
కనుసైగలోన ఎంత చెప్పినా
ఒక పాట రాసి నేను చెప్పనా
ఇంకేమి చేసి నీకు చెప్పినా
అది తక్కువే..
నీ ప్రతి మాటలోన ప్రేమ ఉందని
ఆ చూపులోన తెలుస్తుందది
చెప్పేదెలా తెలుసులే నీ ప్రేమ..
తెలియదే తెలియదే నాకే వివరమే తెలియదే
కుదురుగా ఉండదే మనసెంటో..
తెలియదే తెలియదే వయసా కలవరం ఎందుకే
కన్నులలో కలలలో నువ్వుంటే..
______________________
నటీనటులు: చరణ్ లక్కరాజు (Charan Lakkaraju), వైష్ణవి (Vaishnavi)
గాయకులు: దుర్గా ప్రసాద్ మిత్తిరెడ్డి (Durga prasad Mittireddi), జాగర్లపూడి వినుత్న (Jagarlapudi Vinuthna)
లిరిక్స్ : లక్ష్మీ ప్రియాంక (Lakshmi Priyanka)
సంగీతం: నిక్కీ జార్జ్ (Nikki George)
నిర్మాత: దుర్గా ప్రసాద్ మిత్తిరెడ్డి (Durga prasad Mittireddi)
ఎడిషన్-దర్శకత్వం: వంశీ చిలుకూరి (Vamsi Chilukuri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.