Home » రోడ్లపై టోల్ ఛార్జీలు నిలిపివేత… ఎందుకో తెలుసా!

రోడ్లపై టోల్ ఛార్జీలు నిలిపివేత… ఎందుకో తెలుసా!

by Vishnu Veera
0 comment

ముందుగా  తెలుగు రీడర్స్ కి  స్వాగతం.

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగా లేని రోడ్లపై వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయవద్దని టోల్ సంస్థలకు సూచించారు.
వాహనదారులు సరైన రోడ్డు సౌకర్యాలు కల్పించకుండా వారి నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

సరిగా లేని రోడ్లపై టోల్‌ ఛార్జీలు వసూలు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురి అవుతారు అని నితిన్ గడ్కరీ చెప్పారు. వాహనదారులకు మంచి సేవలు, సౌకర్యాలు అందించలేనప్పుడు వారి నుంచి టోల్‌ ఛార్జీలు కూడా వసూలు చేయవద్దని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

ఇలాంటి రోడ్లకు సంబంధించి చాలామంది ఇప్పటికే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టులు పెడుతున్నారని నితిన్ గడ్కరీ తెలిపారు. కాబట్టి మంచి రోడ్లు అందించలేనప్పుడు టోల్‌ కూడా వసూలు చేయకూడదని టోల్ సంస్థలకు నితిన్ గడ్కరీ సూచించారు. ఒకవేళ రోడ్లపై గుంతలు ఏర్పడినా, ఆ మార్గాల్లో టోల్‌ సంస్థలు టోల్ ఫీజులు వసూలు చేస్తే రాజకీయ నాయకులు అయినందుకు ప్రజలు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని నితిన్ గడ్కరీ తెలిపారు.

అలాగే వాహనదారులకు ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా టోల్‌గేట్ల వద్ద వాహనాలను క్లియర్ చేయాలని నేషనల్‌ హైవే ఫీల్డ్‌ ఆఫీసర్లకు నితిన్ గడ్కరీ సూచించారు. సేవలు వేగంగా అందించి రద్దీ లేని ప్రయాణాలు కల్పించాలని పేర్కొన్నారు. ఇక త్వరలోనే శాటిలైట్ ఆధారంగా టోల్‌ ఛార్జీలు వసూలు చేసే విధానం అందుబాటులోకి రానుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని నితిన్ గడ్కరీ చెప్పారు. అందుకే ఈ శాటిలైట్ ఆధారిత టోల్‌ ఛార్జీల వసూలు విధానాన్ని ఈ సంవత్సరంలోనే మొదలుపెట్టనున్నట్లు వివరించారు.తొలి దశలో 5 వేల కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు.

దీనిలో భాగంగా టోల్‌ వసూలుకు కీలకమైన వెహికల్‌ ట్రాకర్‌ సిస్టమ్‌ యూనిట్‌ను ఆయా వాహనాల్లో అమర్చడం జరుగుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ వ్యవస్థ కాస్తా అందుబాటులోకి వస్తే టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దశలవారీగా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment