Sri Venkatesa O Srinivasa | సూరీడుపువ్వా లిరిక్స్ | suridu poova s. Janaki

by Lakshmi Guradasi

ఓ.. ఓ… ఓ… ఓ……. సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
నడిరేయి జాములో తడి లేని సీమలో…
సూరీడుపువ్వు జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే

బతుకే బరువు ఈ నేలకి కరుణే కరువు ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకి శ్వాసే చేదు ఈ గాలికి
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి
ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి
నిదురించునే నీ తురుపు నిట్టూర్పే ఓదార్పు
అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్నీ కరిగించగా

ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి
ఏమవుతుందో నీ ఊపిరి వేటడిందే కాలం మరి
నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని
నీ కళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని
పరుగాపని పదలతో కొనసాగని నీ యాత్రని

శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్లయ్యా
అలా వైకుంఠాన అంతఃపురాణ ఏ మూల ఉన్నావయ్యా
ఓ నామాల దేవర ఈ నీ మాయ ఆపరా
శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్లయ్యా
అలా వైకుంఠాన అంతఃపురాణ ఏ మూల ఉన్నావయ్యా

In English Version:

Oo.. Oo… Oo… Oo…….

Sooreedupuvvaa, jaabilli guvvaa
Chinaboyinavendhuke
Maakanti chaluva koneti kaluva
Kanneeti koluvendhuke

Nadireyi jaamulo, thadi leni seemalo…
Sooreedupuvvu, jaabilli guvvaa
Chinaboyinavendhuke
Maakanti chaluva koneti kaluva
Kanneeti koluvendhuke

Bathuke baruvu ee nelaki
Karune karuvu ee neetiki
Veluge raadhu ee vaipuki
Shwaase chedhu ee gaaliki

Aakaashame migilunnadhi
Ekaaki payanaaniki
Aa shoonyame thodunnadhi
Nee chinni praananiki

Nidurinchune nee thurupu
Nittoorpe odaarpu

Andhaala chilaka, aparanji molaka
Allaadake anthagaa
Panneeti chinuka, kanneeti munakaa
Kalalannee kariginchagaa

Evaipunandho emo mari
Jaade ledhe daari dari
Emavuthundho nee oopiri
Vetaadindhe kaalam mari

Nee gundello Godavari
Nerpaali edureethani
Nee kallalo Deepaavali
Aapaali edha kothani

Parugaapani padalatho
Konasaagani nee yaatrani

Sri Venkateshaa… Oo Srinivaasaa
Ee mounam ennaallayyaa
Alaa Vaikunthaana anthahpuraana
Ae moola unnaavayyaa

Oo naamaala devaraa
Ee nee maaya aaparaa

Sri Venkateshaa… Oo Srinivaasaa
Ee mounam ennaallayyaa
Alaa Vaikunthaana anthahpuraana
Ae moola unnaavayyaa

__________________

Song Credits:

పాట: సూరీడు పువ్వ (Suridu Puvva)
చిత్రం: అంతఃపురం (Anthahpuram)
తారాగణం: జగపతి బాబు (Jagapati Babu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), సాయి కుమార్ (Sai Kumar), సౌందర్య (Soundarya)
సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraja)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: S జానకి (S Janaki)

See Also plz click on this: asalem-gurthuku-radu-song-lyrics-anthahpuram

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like