మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. ఎన్నో భాషలు, సంస్కృతులు, వ్యవహారాలు. మన దేశం లో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా. తెలియకపోతే ఈ సంచికలో దాని గురించి చెప్పబడినది చదివేయండి.
రాష్ట్రాల పేర్ల వెనుక ఉన్న చిన్న కథలు:
ఒక భారతీయ పౌరుడిగా మన దేశం లోని రాష్ట్రాల పేర్లు వెనుక ఉన్న చిన్న కారణాలు తెలుసుకోవడం మన బాధ్యత. అవి ఇప్పుడు తెలుసుకుందాం రండి.
హిమాచల్ ప్రదేశ్:
హిమాచల్ ప్రదేశ్ అనే పేరు సంస్కృత పదం నుండి వచ్చినది. సంస్కృతం లో హిమ అంటే మంచు, అచల్ అంటే పర్వతం, అనగా మంచు పర్వతాలు ఉండే ప్రాంతం అని అర్ధం.
గుజరాత్:
పూర్వం 7, 8 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని గుజ్జర్లు పాలించేవారు. అందుకనే దీనికి గుజరాత్ అనే పేరు వచ్చింది.
మహారాష్ట్ర:
మహారాష్ట్ర అనే పేరు సంస్కృత పదం నుండి వచ్చినది. మహా అనగా గొప్పది, రాష్ట్ర అనగా దేశం. అంటే గొప్ప దేశం అని అర్ధం.
ఉత్తరాఖండ్:
2000 సంవత్సరం లో ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ విడిపోయింది. ఉత్తర అంటే ఉత్తరం దిక్కు, ఖండ్ అంటే భూమి అని అర్ధం. ఉత్తరాఖండ్ అంటే ఉత్తరభూభాగము అని అర్ధం.
రాజస్థాన్:
రాజస్థాన్ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. పూర్వం రాజస్థాన్ ని రాజపుత్తాన అని పిలిచేవారు అంటే రాజపుత్ లు ఉండే భూమి కనుక. దానిని ఇప్పుడు రాజస్థాన్ గా మార్చారు.
ఝార్ఖండ్:
ఝార్ఖండ్ సంస్కృత పదం నుండి వచ్చినది. ఝార్ అనగా అడవి అని అర్ధం, ఖండ్ అనగా భూమి అని అర్ధం. అంటే అటవీ భూమి అని అర్ధం.
హర్యానా:
హర్యానా అనే పదం, హరి అనగా విష్ణువు లేదా కృష్ణుడు అని అర్ధం, అన అనగా వచ్చారు అని అర్ధం. మహాభారతం కాలం లో కృష్ణుడు లేదా విష్ణువు నడిచిన నెల కనుక హర్యానా అనే పేరు వచ్చింది.
పంజాబ్:
పంజాబ్ అనే పేరు పంజ్ అనగా అయిదు అని అర్ధం, అబ్ అనగా నీరు అని అర్ధం. అయిదు నదులు ఉండే రాష్ట్రం కనుక పంజాబ్ అనే పేరు వచ్చింది. (Land of Five Rivers)
తెలంగాణ:
తెలంగాణ అనే పేరు త్రిలింగ అనే పదం నుండి వచ్చింది అంటే మూడు శివ లింగాలు అని అర్ధం. మన పురాతన శివుడు గుడులు అయినా శ్రీశైలం, కాళేశ్వరం, మరియు ద్రాక్షారామం క్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి గనుక తెలంగాణ అనే పేరు వచ్చింది.
మిజోరాం:
మిజోరాం అనే పేరు మీ అనగా మనుషులు, జో అనగా ఎతైన ప్రాంతం అని అర్ధం. ఎతైన ప్రాంతం లో నివసించే మనుషులు కనుక ఆ రాష్ట్రాన్ని మిజోరాం అని పిలుస్తాము.
నాగాలాండ్:
నాగల్యాండ్ అనే పేరు బర్మీస్ (Burmese) పదం నాకా నుండి వచ్చింది, అంటే చెవి దుత్తులు, ముక్కుపుడకలు పెట్టుకొనే వారు. అనగా నాగ అనే జాతి ని ప్రతిబింబిస్తుంది. ఆ జాతి వారు ఈ భూ భాగం లో ఉండే వారు కనుక ఈ రాష్ట్రానికి నాగాలాండ్ అనే పేరు వచ్చింది.
మణిపూర్:
మణిపూర్ పేరు సంస్కృతం నుండి వచ్చినది. మణి అంటే ఆభరణాల భూమి (Land Of Jewels) అని అర్ధం. భారత దేశం లోని ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ ఒక ఉత్తమమైన రాష్ట్రంగా పరిగణించబడుతుంది.
మేఘాలయ:
మేఘాలయ అనే పదం సంస్కృతం నుండి వచ్చినది. మేఘ అనగా మబ్బులు అని అర్ధం, ఆలయ అనగా నివాసం అని అర్ధం. మేఘాలయ అంటే మబ్బుల కు నివాసం గా ఉండేది అని అర్ధం (Land Of Clouds).
అరుణాచల్ ప్రదేశ్:
అరుణాచల్ ప్రదేశ్ అనే పేరు సంస్కృత పదం నుండి వచ్చినది. అరుణ అనగా తెల్లవారింది అని, అచల్ అనగా పర్వతం అని అర్ధం, అంటే భారత దేశం లో మొదట గ సూర్యోదయాన్ని చూసే రాష్ట్రం అని అర్ధం.
త్రిపుర:
త్రిపుర పేరుకి మూడు కారణంలు ఉన్నాయి. మొదటిది కొక్బోరోక్ (Kokborok) బాష లో టుయ్ అనగా నీరు అని అర్ధం, పర అనగా దగ్గర అని అర్ధం; రెండవది బాల త్రిపుర సుందరి దేవి పేరు నుండి వచ్చినది అని; మూడవది ఈ రాష్ట్ర ప్రాంతాన్ని ఒకప్పుడు త్రిపుర అనే రాజు పాలించేవాడు అని కథలు ఉన్నాయి.
అస్సాం:
అస్సాం అనే పేరు అహోం నుండి వచ్చినది. అహోం అనేది ఇండో-ఆర్యన్ పదం దానికి అర్ధం అసమానంగా ఉండడం. ఈ రాష్ట్ర భూమి అలా అసమానంగా ఉండడం వలన దీనికి అస్సాం అనే పేరు వచ్చింది.
సిక్కిం:
ఈ పేరు లింబు పదాల నుండి వచ్చినది సు అనగా కొథ్ది ఖియం అనగా ప్యాలస్ అని అర్ధం. ఈ పేరు ఆ ప్రాంతం యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
తమిళ్ నాడు:
తమిళ్ నాడు అనగా తమిళులు ఉండే భూమి అని అర్ధం. ఇంకా తమిళ అంటే తియ్యటి తేనె అని అర్ధం కూడా వస్తుంది. తమిళ బాష మాట్లాడే వ్యక్తులు ఎక్కువగా ఉండడం వలన ఈ రాష్ట్రానికి తమిళ్ నాడు అనే పేరు వచ్చింది.
కర్ణాటక:
కర్ణాట అనే పేరు కారు అనగా గంబీరమైన అని అర్ధం, నాట్ అనగా భూమి అర్ధం. మనం గమనించినట్లు అయితే కర్ణాటక ప్రాంతం అంత డెక్కన్ ప్లాటీయూ ఉంటుంది. ఇది ఆ రాష్ట్ర భౌగోలియక ప్రాముఖ్యతను సూచిస్తుంది.
కేరళ:
కేరళ అనే పేరు చేరా రాజవంశంతో ముడిపడి ఉంది. చేరా ఆలం నుండి పుట్టింది. తరువాత అది ప్రస్తుతం కేరళం గా మారింది.
ఆంధ్ర ప్రదేశ్:
ఈ పేరు సంస్కృత పదం ఆంధ్ర నుండి వచ్చింది అంటే దక్షిణం. ఈ ప్రాంతంలో ఆంధ్రులు అని పిలువబడే తెగ ఉండేవారు అందుకనే ఈ రాష్టార్నికి ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు వచ్చింది.
గోవా:
గోవా యొక్క ఖచ్చితమైన మూలం అస్పష్టంగా ఉంది. ఇది సంస్కృత పదం గో (ఆవు) నుండి వచ్చి ఉండవచ్చు లేదా యూరోపియన్ మరియు పోర్చుగీస్ భాషలలో మూలాలను కలిగి ఉండవచ్చు
ఒడిస్సా:
మధ్య భారతదేశంలో చారిత్రాత్మకంగా నివసిస్తున్న ఓడ్రా ప్రజలను సూచించే ఓడ్రా విషయ లేదా ఓడ్రా దేశా అనే సంస్కృత పదాల నుండి ఈ పేరు ఉద్భవించింది. ఇది రాష్ట్రాల సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఉత్తర్ ప్రదేశ్:
ఉత్తర ప్రదేశ్ అంటే ఉత్తర భాగం గా అనువదించబడింది, ఉత్తర అంటే ఉత్తరం మరియు ప్రదేశ్ అంటే ఆ భాగానికి చెందినది అని. ఇది భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటి.
మధ్య ప్రదేశ్:
ఈ పేరుకు సంస్కృతంలో సెంట్రల్ ప్రావిన్స్ అని అర్ధం, ఇది మధ్య (సెంట్రల్) మరియు ప్రదేశ్ (ప్రాంతం) నుండి ఉద్భవించింది. ఇది భారతదేశం నడిబొడ్డున ఉన్న రాష్ట్రాల భౌగోళిక స్థానాన్ని ప్రతిబింబిస్తుంది.
వెస్ట్ బెంగాల్:
ఈ పేరు సంస్కృత పదం వంగ నుండి ఉద్భవించింది. కాలక్రమేణా, దాని భాషా మరియు సాంస్కృతిక పరిణామాన్ని ప్రతిబింబిస్తూ, పర్షియన్‌లో బంగాలా, హిందీలో బంగాల్ మరియు బెంగాలీలో బంగ్లా వంటి వైవిధ్యాలు ఉద్భవించాయి.
బీహార్:
ఈ పేరు పాలి పదం విహార నుండి వచ్చింది, దీని అర్థం “నివాసం”, సంస్కృతంలో మూలాలు ఉన్నాయి. ఇది వాస్తవానికి బౌద్ధ సన్యాసుల మఠాలు లేదా నివాసాలను సూచిస్తుంది, కాలక్రమేణా బీహార్‌గా పరిణామం చెందింది.
చత్తిస్గఢ్:
చత్తీస్‌గఢ్ అంటే ముప్పై ఆరు కోటలు అని అర్ధం. ఈ ప్రాంతంలోని 36 పురాతన కోటల నుండి ఉద్భవించాయి. ఇది చారిత్రాత్మకంగా రామాయణం వంటి ఇతిహాసాలలో పేర్కొనబడిన దక్షిణ కోసల ప్రాంతంలో భాగం.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను సందర్శించండి.