శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా సాంగ్ లిరిక్స్ | Ammoru Thalli

by Lakshmi Guradasi

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా
చిట్టి చెల్లెలివమ్మా
ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ
కంచి కామాక్షివమ్మా

నీ నవ్వులో.. నీ నవ్వులో
పున్నమి వెన్నెలే విరబూయునమ్మా
తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా
నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా
చిట్టి చెల్లెలివమ్మా
ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ
కంచి కామాక్షివమ్మా
ఒడిలోన లాలించి ఓదార్చి పాలిచ్చి
నను నీవు పెంచావమ్మా
అమ్మవలె మురిపించి
ఆటలనే ఆడించి లాలినే పోశావమ్మా

తల్లీ అభిరామి బొట్టును నాకు దిద్దావే
శ్రీశైలం భ్రమరాంబ పూల జడనే వేశావే
తారలనే దూసుకు తెచ్చి కమ్మలుగా ఇచ్చావే
కాంచిపురంలో నాకు చీర కొంటివే
నా ఆటపాటలో నువ్వు బొమ్మవైతివే

కాశీవిశాలాక్షి హారాలే కొని తెచ్చి
నాకోర్కె తీర్చావమ్మా
కాళహస్తి జ్ఞానాంబ బంగారు గాజులను
చేతులకే వేశావమ్మా

చీకటిని కాటుకగా నీవు నాకు దిద్దావే
అందంగా ముక్కెరగా జాబిలి ముక్కని పెట్టావే
ఆ ఇంధ్రధనువును తెచ్చి వడ్డాణంగా ఉంచావే
బాల సుందరీ నీవు శక్తి రూపిణీ
నేను పాట పాడగా నీవు ఆట ఆడవా

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా
చిట్టి చెల్లెలివమ్మా
ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ
కంచి కామాక్షివమ్మా

నీ నవ్వులో.. నీ నవ్వులో
పున్నమి వెన్నెలే విరబూయునమ్మా
తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా
నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా
తల్లి అన్నపూర్ణకు నేను అన్నంపెట్టనా
నేను కన్నతల్లిలా నీకు జోలపాడనా

In English Version:

Sri Venkatesuniki Chellelivamma
Chitti Chellelivamma
Indrakiladrilo Velasina Durgavu Nivamma
Kanchi Kamaksivamma

Ni Navvulo.. Ni Navvulo
Punnami Vennele Virabuyunamma
Talli Annapurnaku Nenu Annampettana
Nenu Kannatallila Niku Jolapadana

Sri Venkatesuniki Chellelivamma
Chitti Chellelivamma
Indrakiladrilo Velasina Durgavu Nivamma
Kanchi Kamaksivamma
Odilona Lalinchi Odarchi Palichhi
Nanu Nivu Penchavamma
Ammavale Muripinchi
Atalane Adinchi Laline Posavamma

Talli Abhirami Bottunu Naku Diddave
Srisailaṁ Bhramaramba Pula Jadane Vesave
Taralane Dusuku Techhi Kammaluga Ichhave
Kanchipuranlo Naku Chira Kontive
Na Atapatalo Nuvvu Bommavaitive

Kasivisalaksi Harale Koni Techhi
Nakorke Tirchavamma
Kaḷahasti Jñanamba Bangaru Gajulanu
Chetulake Vesavamma

Chikatini Katukaga Nivu Naku Diddave
Andanga Mukkeraga Jabili Mukkani Pettave
A Indhradhanuvunu Techhi Vaddananga Unchave
Bala Sundari Nivu Sakti Rupini
Nenu Pata Padaga Nivu Ata Adava

Sri Venkatesuniki Chellelivamma
Chitti Chellelivamma
Indrakiladrilo Velasina Durgavu Nivamma
Kanchi Kamaksivamma

Ni Navvulo.. Ni Navvulo
Punnami Vennele Virabuyunamma
Talli Annapurnaku Nenu Annampettana
Nenu Kannatallila Niku Jolapadana
Talli Annapurnaku Nenu Annampettana
Nenu Kannatallila Niku Jolapadana

__________________

Song Credits:

చిత్రం : అమ్మోరు తల్లి (Ammoru Thalli)
నటీనటులు: దేవయాని (Devayani), రోజా (Roja)
సంగీతం: దేవా (Deva)
సాహిత్యం – వెలిదండ్ల (Velidandla)
గాయకులు: చిత్ర (Chitra)
నిర్మాత: ఎం శ్యామలమ్మ (M Shyamalamma)
దర్శకుడు: రామనారాయణ (Rama Narayana)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like