శ్రీ రంగ రంగ చీకట్లో దొంగ
నా చీర బెంగ తీర్చేయి రంగ
శ్రీ రంగ రంగ చీకట్లో దొంగ
నా చీర బెంగ తీర్చేయి రంగ
ముద్దు ముచ్చటుంది ఓ చిన్న మాటుంది
ఈ సంధ్య వేళల్లో నీతోనే పని ఉంది
వేసంగి వెన్నెలలో సారంగా
ఉయ్యాలలుగేయ్యారో గరంగా
అందాల రాధా విన్న నీ గాధ
చేయేస్తే మీద అది తప్పు కాదా
అందాల రాధా విన్న నీ గాధ
చేయేస్తే మీద అది తప్పు కాదా
వద్దు వద్దంటున్న వరసే కలిపేస్తావు
వెంటాడి వేధిస్తూ నన్నొదలనంటావు
వద్దన్న అడ్డొస్తావే వయ్యారి
నన్నెట్టా రమంటావే నీ దారి
శ్రీ రంగ రంగ చీకట్లో దొంగ
నా చీర బెంగ తీర్చేయి రంగ
అందాల రాధా విన్న నీ గాధ
చేయేస్తే మీద అది తప్పు కాదా
పాలు నీలలాగ నువ్వు నేను ఉంటే
జన్మంతా సరసాల సంగీతమౌతుంది
ఆశ పడితే కాదు హద్దులుంటే మేలు
చేజారి పోయాక చేసేది ఏముంది
నీ జంట చేరేది ఎట్టా
మరి నన్నింకా వదిలేయాకట్టా
నన్నిట్ఠా వేధించాకే ఓ భామ
నీ మనసు మార్చేసుకో పోవమ్మా
చుక్కల్లో చందూరుడే నీవయ్యా
ఏమైనా నిన్ను వీడను లేవయ్యా
మురిపెంగా నన్ను చూసి లాలించి పాలించి
వరస కలుపుకుంటే వయసంతా రాసిస్తా
అంతో ఇంతో కొంత రాసుండాలే రాధా
ఆనాడే అన్నట్టు నీ చెంతకొచ్చేస్తా
వద్దన్నా ఆగేది ఎట్టా
ఈడు చేజారితే ఇంకా ఎట్టా
అయ్యో ఊరంతా చూస్తుండంగా ఓ భామ
నా పరువు తీసెయ్యక ఉండమ్మా
చీకట్లో చాపేసిన ఓ మావ
మల్లెల్లో ఏళ్లేసినా రా మావ
శ్రీ రంగ రంగ చీకట్లో దొంగ
నా చీర బెంగ తీర్చేయి రంగ
అందాల రాధా విన్న నీ గాధ
చేయేస్తే మీద అది తప్పు కాదా
శ్రీ రంగ రంగ…
వద్దమ్మా తప్పు..
శ్రీ రంగ రంగ..
వామ్మో వద్దు
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.