సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
నల్ల నల్లాని కళ్ళతో
నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే
గుండె గాలిలో తేలుతు
ఆరాటలాడుతూ నీ ఒళ్ళో నే వాలెనే
సుట్టు దిప్పుకున్నావే
ఓ సిన్నా రాములమ్మ
సెమట సుక్కోలే తీసెయ్యకే
నీ సీర కొంగుకే ముడివెయ్యవే..
జొన్న సేను కాడ
సద్ది బువ్వ లాగా కమ్మని నీ మాటలే
ఏటి పరుగులోని నాటు పడవల్లగా
కదిలే నీ అడుగులే..
కోనేటి నీళ్లలో వెలిగేటి దీపాల్లో
నీ సూపులే ఉన్నవే
నీ వైపే చూస్తున్న నీ కోసం చస్తున్నా
ఓ సారి చూడవే..
పట్టుకుంటా నీ చేతినే
ఎన్ని జన్మలైనా విడువనే
కట్టుకోవే నీ కొంగునే
నుదుటి కుంకమ్లా నేనుంటానే..
సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
నల్ల నల్లాని కళ్ళతో
నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే
గుండె గాలిలో తేలుతు
ఆరాటలాడుతూ నీ ఒళ్ళో నే వాలెనే
సుట్టు దిప్పుకున్నావే
ఓ సిన్నా రాములమ్మ
సెమట సుక్కోలే తీసెయ్యకే
నీ సీర కొంగుకే ముడివెయ్యవే..
______________
Song Credits:
పాట శీర్షిక : సొమ్మసిల్లి పోతున్నవే (Sommasilli Pothunnave)
ఆల్బమ్ / సినిమా: మజాకా (Mazaka)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
గాయకులు – రేవంత్ (Revanth)
సాహిత్యం – రాము రాథోడ్ (Ramu Rathod), ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada)
నటీనటులు – సందీప్ కిషన్ (Sundeep Kishn), రీతూ వర్మ (Ritu Varma),
దర్శకత్వం – త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.