Home » వర్షాకాలంలో దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు

వర్షాకాలంలో దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు

by Shalini D
0 comment

మీ వంటగదిలోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో జలుబు, దగ్గును తగ్గించుకోవచ్చు. అవేంటో, వాటినెలా వాడాలో తెల్సుకోండి. వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

వాతావరణం మారిన వెంటనే జలుబు, దగ్గు మొదలవుతాయి. దగ్గు కూడా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీల వల్ల వస్తుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండటం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి ఉంటే వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు. కొన్ని ఆయుర్వేద ఆహారాలు జలుబు, దగ్గు సమస్యను తగ్గిస్తాయి.

అల్లం: అల్లం టీని చాలా మంది తాగుతారు. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.అల్లం టీ తాగడం వల్ల దగ్గు, జలుబు నయమవుతాయి.

పసుపు: వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గుతో బాధపడుతుంటే ఆరోగ్యంగా ఉండటానికి, ఈ సాధారణ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి పసుపు పాలు తాగండి. పసుపులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి.

మిరియాలు: వంటగదిలో నల్ల మిరియాలను అనేక ఆహారాలలో మసాలా దినుసుగా ఉపయోగిస్తారు.అయితే ఇది మసాలా దినుసు మాత్రమే కాదు వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుకు ఔషధం. జలుబు లేదా దగ్గు ఉంటే తేనెతో నల్ల మిరియాలు తింటే ఈ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment