సివంగి పిల్ల (Sivangi Pilla) సాంగ్ లిరిక్స్ – పందెం కోడి 2 (Pandem Kodi 2)

by Lakshmi Guradasi

సివంగి పిల్ల సివంగి పిల్ల
సిరాకు పెట్టి సంపకే
సంపంగి పూల సునామీ లాగ
నా మీద దాడి చేయకే

పీచు మిఠాయి పెదవే
అరె పీల్చుతొంది నా ఎదనే
పామల్లె ఊగే నడుమే
అరె పెంచెను గుండె దడనే

అరెరె పొట్టేలు లాంటి పిల్లాన్ని
కాలి పట్టిగా మార్చావే
అరె నాటు కొడవలి లాంటి నాతో
కూరలు తరిగవే

వదిలేసి వెల్లకే
నిద్దర రాదే కళ్లకే

సివంగి పిల్ల
హే హే
సివంగి పిల్ల
హే హే

సివంగి పిల్ల సివంగి పిల్ల
సిరాకు పెట్టి సంపకే
సంపంగి పూల సునామీ లాగ
నా మీద దాడి చేయకే

పైటలో గాలులే పంచెనే శ్వాసలే
నోటిలో మాటలే పాయసం మూటలే
అడుగుల జాడలే హంసలా మేడలే
కళ్లలో కాంతిని అడిగి
వెలిగెను చూడే సూర్యుడే

మా ఊరి సాయబు అత్తరు లాగ
చొక్కాకు అంటేసావే
అరె కొరమీను చేపల వాసన లాగ
బుర్రంతా నిండేసావే
ఒదిలేసి వెల్లకే
ముల్లై మనసును గిల్లకే

సివంగి పిల్ల
హే హే
సివంగి పిల్ల

చెప్పని మాటలే కంటికే వినబడే
చెయ్యని చేతలే గుండెకే కనబడే
పొందని అలజడే ఎందుకో అలవడే
చెవులలో దుద్దుల్లాగ
హృదయాని ఊపేసావులే

బంగాళ దుంపలు బాగా దోచి
చెంపల్లో దాచేసావే
అరె పంచె వన్నెల చిలకలు నేసిన
పావడ చుట్టేసావే

వదిలేసి వెల్లకే
నాపై పిడుగులు చల్లకే

సివంగి పిల్లా
హే సివంగి పిల్లా
హే హే

సివంగి పిల్ల సివంగి పిల్ల
సిరాకు పెట్టి సంపకే
సంపంగి పూల సునామీ లాగ
నా మీద దాడి చేయకే

సివంగి పిల్ల
హే హే
సివంగి పిల్ల
హే సివంగి పిల్లా
హే సివంగి పిల్లా
హే హే
హే సివంగి పిల్లా

__________________

సాంగ్ – సివంగి పిల్ల (Sivangi Pilla)
సినిమా – పందెం కోడి 2 (Pandem Kodi 2)
గాయకుడు – జితిన్ రాజ్ (Jithin Raj)
సంగీతం – యువన్శంకర్ రాజా (Yuvanshankar Raja)
లిరిక్స్ – చంద్రబోస్ (Chandrabose)
నటీనటులు – విశాల్ (Vishal), కీర్తి సురేష్ (Keerthi Suresh), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)
దర్శకుడు – ఎన్ లింగుసామి (N Lingusamy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like