Home » శివ దీక్ష నియమాలు | శివానుగ్రహం కోసం

శివ దీక్ష నియమాలు | శివానుగ్రహం కోసం

by Nikitha Kavali
0 comments
Siva Deeksha Niyamalu

ఓం నమః శివాయ: భగవంతునికి చేరువ అవ్వడానికి మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన హిందూ ధర్మం లో దేవుడి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తాము. ఆలా మన మనసును దైవానికి అంకితం చేయడం లో ఎంతో ప్రశాంతత ఉంటుంది. మన పెద్దలు దైవ మార్గం లో నడవడానికి ఎన్నో మార్గాలను కనుగొన్నారు. అలంటి వాటిలోదే దైవాన్ని దీక్షతో పూజించడం. అయ్యప్ప స్వామి దీక్ష, భవాని దీక్ష, అలాగే శివుడు, ఆంజనేయస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా ప్రతి ఒక్క దేవుడికి ప్రత్యేకమైన కాలంలో దీక్షను పట్టి పూజిస్తూ ఉంటాము.

ఈ సంచికలో శివ మాల కు సంబందించిన దీక్షకు పాటించాల్సిన నియమాలు, ప్రక్రియలను వివరంగా చెప్పబడినది. ఆలస్యం చేయకుండా చదవండి.

శివ దీక్ష గురించి మన పురాణాలలో:

శివ దీక్షను మొదటగా పార్వతి దేవి చేసినది. ఆ పరమ శివుని దీక్షను ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం వలన ఆ శివును అనుగ్రహం తో పార్వతి దేవి ఆ పరమ శివును అర్ధాంగి అయినది అని మన పురాణాలూ చెబుతున్నాయి. త్రేతాయుగం లో శ్రీ రాముడు, ద్వాపర యుగం లో అర్జునుడు, శ్రీ కృష్ణుడు, భక్త కన్నప్ప, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా శివ దీక్షను స్వీకరించారు.

శివ దీక్ష నియమాలు:

అయ్యప్ప మాల, భవాని మాలల లాగానే శివుడి మాలకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ శివ మాలను 108 రోజులు మహా మండల దీక్ష, 41 రోజులు మండల దీక్ష, 21 రోజులు అర్థ మండల దీక్షలు గా స్వీకరిస్తారు.

  • చందనపు రంగు వస్త్రాలు లేదా నీలపు రంగు వస్తర్లను ధరించాలి. ఎక్కువగా చందనపు రంగు వస్త్రాలను ధరిస్తుంటారు.
  • ధూమపానం, మత్తు పదార్థాలను, మాంసాహారం ను సేవించకూడదు.
  • దగ్గర బంధువులు ఎవరైనా చనిపోతే వెంటనే మాల ను తీసివేయాలి.
  • ఈ దీక్ష సమయం లో పాదరక్షలను అసలు ఎప్పుడు తొడుక్కోకూడదు.
  • క్షౌరము (Shaving) చేయించుకోకూడదు.
  • దీక్ష లో ఉన్నంత కాలం బ్రహ్మచర్యం పాటించాలి
  • ఒక రోజులో మూడు పుటలు స్నానం చేసి శివ పూజ చేయాలి. మూడు పుటలు వీలు లేని వాళ్ళు ఉదయం మరియు సాయంకాలం సంధ్య సమయం లో సుబ్రాంగా స్నానం చేసి పూజ చేయాలి.
  • ఎప్పుడు నుదుటి మీద చందనం, విభూది, కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలి.
  • ఈ దీక్ష సమయం లో ఎక్కువగా మాట్లాడకూడదు.
  • ఎప్పుడు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. “ఓం నమః శివాయః”
  • ఎవ్వరిని పేరు పెట్టి పిలవకూడదు. అయ్యప్ప స్వాములు ఎలాగైతే తోటి వారిని స్వామి అని పిలుస్తారో అలాగే శివ దీక్ష వారు కూడా తమ తోటి వారిని శివ అని పిలవాలి.
  • విలాసాలకు పోకూడదు. చాల సాత్వికంగా జీవితాన్ని సాగించాలి.
  • కటిక నేలపై నిద్రించాలి.
  • శాఖాహారం మాత్రమే స్వీకరించాలి. దేనిని కూడా అతిగా తినకూడదు.

ఈ దీక్ష స్వీకరించిన అప్పటి నుంచి ప్రతి రోజు ఈ నియమాలను పాటించాలి. దీక్ష సమయం పూర్తి అయిపోయిన తరువాత శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రారంరాంబిక దేవిని దర్శించుకొని దీక్షను పూర్తి చేయాలి.

శివ దీక్ష మాల ధారణ మంత్రము:

ఓంకార శక్తి సంయుక్తం-సచ్చిదానంద రూపిణీం
శ్రీశైలేశదశాపూర్ణం -శివముద్రాం నమామ్యహం

ఈ మంత్రము జపిస్తూ రుద్రాక్షమాలకు ఉన్న స్వామివారి ముద్రకు ప్రణామం చేయాలి.

శ్రీశైల శృంగ నిలయః సాక్షాత్తు శ్రీ మల్లికార్జునః
దీక్షా బద్ధ స్వరూపాంచ- ముద్రాం మే పాతు సర్వదా

ఈ మంత్రమును జపిస్తూ శివ మాల ధారణం చేయాలి.

ఈ దీక్ష చేస్తున్న వారు వీలు ఉన్నప్పుడల్లా శివ నమ స్మరణం చేస్తూనే ఉండాలి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.