సిట్ట సిట్టణాలు గొట్టే సెరువుల్లో నిండే
గొట్టు గొట్టాణాలు గొట్టే గోదారివంగే
దుక్కుళ్లు దున్నేటీలో…
దుక్కుళ్లు దున్నేటీలో అన్నదాతలు
పెల్లెల్ల రాలేటిలో సెమటసుక్కలు
కుడికన్ను అదరవట్టే కూసున్నకాడ
గండువిల్లి ఎదురూవచ్చే గడాపల్లా కాడ
పాలపిట్టలరిసినాయో…
పాలపిట్టలరిసినాయో పాలాదుమీద
గుడ్లగూబ కూసినాదో గుండెల్ల మీద
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
అరకలు దున్ని మీనాన్న అలిసిపోయిండు
పక్కింటివాళ్ళము మమ్ము పలకరించిండు
మమ్ములదోలిండు బిడ్డో…
మమ్ములదోలిండు బిడ్డో మీమేదం మాని
సెంతకు దోలిండు కొడుకో సెలిమికమ్మని
సెంద్రయ్య దుకాన్ల దెచ్చిన సక్కిర గోళీలు
భీమయ్య దుకాన్ల దెచ్చిన బిస్కెట్ల పొట్లం
ఇంటికి బోదాము రండో…
ఇంటికి బోదాము రండో ఇగురంగా బోదాము
బండెక్కి పోదాము రండో భద్రంగా బోదాము
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
ఎత్తుకొచ్చిన పాపం ఎండిని ఇవ్వు
ఎడా వాపిన పాపం ఎకరాలివ్వు
బాలల దెచ్చిన పాపం…
బాలల దెచ్చిన పాపం బంగారమివ్వు
బాధలు వెట్టిన పాపం బంగులాలివ్వు
చెంగు చెంగున లేగ ఆవునుజేరె
రివ్వు రివ్వున గువ్వా గూటినిజేరె
ముదురాల కొడుకు రాలే…
ముదురాల కొడుకు రాలే ఇంటికి రాలే
పాయిరాలా బిడ్డ రాలే పలకరించలే
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
కారేనక కారును పిల్లలు ఆగబడుతుండ్రు
ఆగిన బండ్లను బిచ్చం అడుగుతున్నారు
బొంబాయి దొంగలు బిడ్డో…
బొంబాయి దొంగలు బిడ్డో సిప్పలిచ్చేనా
సిప్పల్లో సిల్లర మొత్తం గుంజుకునేనా
అల్లిపువ్వాలా తీరు ఆడుకున్నారే
సామంతి పువ్వుల తీరు సదువుకున్నారే
మల్లె పువ్వుల తీరో…
మల్లె పువ్వుల తీరు మాసిపోయిరే
రాలే పువ్వుల తీరు రాలిపోయిరే
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
రోజులు గడవావట్టే రోగానవడే
దినము గడవావట్టే దిగులు ఆగదే
నా కొడక యేడున్నావ్ రా…
నా కొడక యేడున్నావ్ రా గొంతెండిపాయే
నా బిడ్డ యేడున్నావే యెల్లిసిపాయే
ఎగిరేసి ఆడిన కొడుకు యేడవున్నాడో
భుజముల ఊగిన బిడ్డ ఎట్లవున్నాదో
దేశాలు దిరిగిన మయ్యో …
దేశాలు దిరిగినమయ్యో దేశాలే పాయే
జాగాలు తిరిగినమయ్యో జాడలే పాయే
పుట్టంగమాకు తల్లీ పురుడోలే పాయే
పెరుగంగమాకు తల్లీ పెళ్లిలే పాయే
పిలవంగా మాకు తల్లీ…
పిలవంగా మాకు తల్లీ తండ్రి లేపాయే
తలువంగా మాకు అయ్యో తల్లి లేపాయే
గద్దలొల్లే మమ్ము తన్నుకొచ్చినే
కోడిపిల్లలా బతుకు మమ్ము జేసెనే
దిక్కులేని పక్షులమో…
దిక్కులేని పక్షులమో దిగులుకు ఉన్నాం
మొక్కులేని పక్షులమో మొగులుకు ఉన్నాం
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టే
నీది అల్లపు లారీ నీది బెల్లపు లారీ సాంగ్ లిరిక్స్ – జానపద పాట
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.