సింతాకు రంగు సీర దేస్తాని సంతకు నువ్వు పోతే

చిన్నంగా లోలోన సంతోష పడిన సింగారి ముద్దుల బావ

చిన్నారి వెన్నెల కోసమని నేను సింతాకు రంగు చీర కొనపోతి
నెమలి కన్నుల దాని కోసమని నేను సిట్టి కాటుక డబ్బ తెత్తమని పోతి
సింతాకు అరె సింతాకు
ఆ సింతాకు రంగు సీర దేస్తాని సంతకు నువ్వు పోతే
చిన్నంగా లోలోన సంతోష పడిన సింగారి ముద్దుల బావ
బుట్టల కమ్ముల దేస్తా అని నువ్వు బుధారం వెళ్ళిపోతే

అద్దముల నిన్నే ముద్దులెట్టుకున్న చిన్నారి ముద్దుల బావ

బంగారు మరదలు కోసమని నేను బుట్టల కమ్ముల దేత్తమని పోతి
బంతి పువ్వుల సొగసున్న దాని కోసం ఇంపైన కమ్మలు తెత్తమని పోతి
బుట్టల అరె బుట్టల
బుట్టల కమ్ముల దేస్తా అని నువ్వు బుధారం వెళ్ళిపోతే
అద్దముల నిన్నే ముద్దులెట్టుకున్న చిన్నారి ముద్దుల బావ
కాళ్ళకు పట్టీలు దేస్తా అని నువ్వు కొల్లాపూర్ వెళ్ళిపోతే

కండ్లల్లా నిన్నే పెట్టుకుని చూసినా గుణముల్లా సక్కని బావ

గడుసుది అత్త బిడ్డ వెన్నెల కోసం గజ్జల పట్టీలు తెత్తమని పోతి
ముద్దుల మరదల కోసమని నేను మోగేటి గజ్జెలు కొందామని పోతి
కాళ్ళకు అరె కాళ్ళకు
కాళ్ళకు పట్టీలు దేస్తా అని నువ్వు కొల్లాపూర్ వెళ్ళిపోతే
కండ్లల్లా నిన్నే పెట్టుకుని చూసినా గుణముల్లా సక్కని బావ
కొప్పున మల్లెలు దేస్తా అని నువ్వు బుధారం వెళ్ళిపోతే కొండూరుకెళ్ళిపోతే

నిండు పున్నమై నీకోసం ఉన్న నింగంతా మనసున్న బావ

కోరిన వెన్నెల కోసం కొప్పున మల్లెలు తెత్తమని పోతి
మరదలు వెన్నెల కోసమని నేను మతైన మల్లెలు తెత్తమని పోతి
కొప్పున అరె కొప్పున
కొప్పున మల్లెలు దేస్తా అని నువ్వు బుధారం వెళ్ళిపోతే కొండూరుకెళ్ళిపోతే
నిండు పున్నమై నీకోసం ఉన్న నింగంతా మనసున్న బావ
నువ్వెన్ని తెచ్చిన నా మనసు మెచ్చేటి బంగారు బావవు నువ్వే
ప్రేమెంత ఇచ్చిన పేరంచు నిలిచిన అందాల బావవు నువ్వే
నూరేళ్ళ పంటై ఉంటాను జంటై నాతోడు నీడై ఉంటే
బారెడు ఆశలు నాకెందుకయ్యా మూరెడు మల్లెల దాన్నే
కోరింది ఇస్తా నీతో నడుస్తా కొత్త పెళ్లి కూతురా నీతోనే వస్తా
అడిగింది ఇస్తా గుండెల్లో దస్తా అందాల వెన్నెల నిన్నే ప్రేమిస్తా
____________
సాంగ్ క్రెడిట్స్ :
నిర్మాత: గౌతమ్ యేనుగంటి (GOWTHAM YENUGANTI)
సాహిత్యం: సాహితీ శ్రీ మల్లెమోని శ్రీకాంత్ (SAHITHI SRI MALLEMONI SRIKANTH)
సంగీతం: అర్మాన్ మేరుగు (ARMAAN MERUGU)
గాయకులు: రాము రాథోడ్ (RAMU RATHOD) & ప్రభ (PRABHA)
నటీనటులు: రాము రాథోడ్ (RAMU RATHOD), లిఖిత (LIKHITHA)
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!