చిన్న దాన్ని నేనయ్యో
నన్నే చూడవేందయ్యో
చిన్న దాన్ని నేనయ్యో
నన్నే చూడవేందయ్యో
మాట మందలియయ్యో
అంత మంకు ఎందయ్యో
చిన్న నాడు ఆడిన మన ఆటలేవయ్యో
చింత బెట్టకు జర్ర నన్నే మల్లి చుడయ్యో
అందమైన దాన్ని నేను
అసలిడిసి పెట్ట నిన్ను
హొయ్
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
మర్రి చెట్టు కింద ఊగిన ఉయ్యలాట
ఇసుక దిబ్బలోన కట్టిన బొమ్మ కోట
మన ఇద్దరి జోడి చుసిన ఊరు వాడ
మనలా మెచ్చుకుంటే మురిసిపోతిని గదరా
గడుసుదాన్ని నేను చూడు
గంత మంకు ఏంది నీకు
ఓయ్
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
మొన్న మ ఇంట్లోనా పెళ్లి సూపులయ్యారో
పిల్ల నచ్చిందంటూ నన్నే మెచ్చినారురో
నిన్నే నచ్చినదాన్ని నిన్నే మెచ్చినదాన్ని
ఎవరు చెప్పినగానీ నిన్నే ఇడవనిదాన్ని
సూడానికే గులాబీని
ముట్టుకుంటే ముళ్ళు గుచ్చే
అయ్యయ్యో
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
యహే
నిన్నే కోరుకుంటి
నీతో ఉంటానంటి
ఇంటి పేరును మర్చి నీతో వస్తానంటి
మా అయ్యాల సేత ఎన్నో తిట్లు తింటి
అలిగి బువ్వతినక అల్లాను మార్చుకుంటి
మొండిదాన్ని నేను చూడు
అర్థమైతలేదా సారు
అబ్బాబ్భా
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
మామిడి కొమ్మలడిగి
మన మనువెప్పుడంటూ
బంతి పువ్వులడిగి
బాసికం కటంటూ
లిల్లి పువ్వులడిగి
మేడలో మాలై తంతు
పసుపు తాడు అడిగే
మన పరిణయమంటూ
మన ఇద్దరి జోడి కుదిరి
నన్ను లగ్గమాడారవయ్యా
యహే
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
మనువులాడుకోవయ్యో
అంత మంకు ఎందయ్యో
జర్ర మందలియయ్యో
జర్ర మాటలాడయ్యో
అంత మంకు ఎందయ్యో
మనువులాడుకోవయ్యో
________________________________________________________
పాట: చిన్న దాన్ని నేనయ్యో (Sinna dhanni nenayyo)
నిర్మాత: దరుగుపల్లి ప్రభాకర్ (Darugupally Prabhakar)
లిరిక్స్ సింగర్: సింగర్ ప్రభ (Singer Prabha)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Azmeera)
తారాగణం : పూజనాగేశ్వరి (Pooja Nageshwari), రౌడీ హరీష్ (Rowdy Harish)
కొరియోగ్రఫీ: శేఖర్ వైరస్ (Shekar Virus)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.