సిలకా పిల్లగా (Silaka Pilaga) folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

వన్నెలాడి నీ వన్నెలు చూసి సిన్నబోయినానే
నేను సిన్నబోయినానే..
సిటీ కొట్టి నా సిన్నెలు పొగిడి చెయ్యి పట్టుకోకోయ్
పిల్లగా సింత పెట్టి పోకోయ్..

నీకు నాకు వరసయిందే
ఈడు జోడు సరిపోయిందే
సంధు జూసుకోని జంట కట్టుకొని
ఒక్కటైతే బాగుంటుందే

సిలకా.. సిలకా నువ్వు పక్కనుంటే రోజంతా పండుగాయే
నా సిలకా నువ్వు లేకపోతే నా బతుకు దండుగాయే
పిల్లగా నువ్వేడా ఉన్న నీ మీద పానమాయే
రా పిల్లగా నువ్వు లేకపోతే మనసంతా సిన్నవాయే

ముద్దుగున్నవే పిల్లా మురిపాలు రాలే నవ్వుల్లా
మరి పొద్దు అంతా నిను చూసిన గాని బుద్ది తీరదే మల్లా
పడ్డరయ్య మాయల్లా మంత్రాలు యేసి మాటల్లా
మరి చీకటైన జర పండనియ్యవు తిరుగుతావు కండ్లల్లా

పిల్ల మీద మానసయిందే మల్ల మల్లగా వాలందే
మల్ల మల్ల నన్ను పక్కకు పిలువకు సిగ్గు జారి సై అంటుందే

పిల్లగా.. పిల్లగా నువ్వేడా ఉన్న నీ మీద పానమాయే
రా పిల్లగా నువ్వు లేకపోతే మనసంతా సిన్నవాయే
సిలకా నువ్వు పక్కనుంటే రోజంతా పండుగాయే
నా సిలకా నువ్వు లేకపోతే నా బతుకు దండుగాయే

కన్ను కొట్టుకో పిల్లగా, నా చెయ్యి పట్టుకో పిల్లగా
అబ్బా సెయ్యి పట్టినా సెంప గిచ్చినా నచ్చినాది ఈ సిలికా
ఆశపెట్టాకే పిల్లా నన్ను గోసపెట్టాకే పిల్లా
నీ సోకు చూపి నా చిట్టి గుండెల మంట పెట్టాకే మల్లా

ఒళ్ళు చూడు వేడికిందే, నిన్ను తోడు రమ్మంటుందే
తొందరేందుకే ఆగవెందుకే తాళిగట్టి మొదలెడతానే

సిలకా.. సిలకా నువ్వు పక్కనుంటే రోజంతా పండుగాయే
నా సిలకా నువ్వు లేకపోతే నా బతుకు దండుగాయే
పిల్లగా నువ్వేడా ఉన్న నీ మీద పానమాయే
రా పిల్లగా నువ్వు లేకపోతే మనసంతా సిన్నవాయే

ఎట్లా చేసెనే బ్రహ్మ, అందంగా చెక్కి నీ బొమ్మ
ఒక్కసారి గిట్ల నిన్ను ముట్టకుంటా మరి ఎందుకమ్మా ఈ జన్మ
ఉండలేకపోతున్నా మనసాగలేకపోతున్నా
నా యాదిలోకి రాకుండా ఉండవు ఏందిరయ్యో క్షణమైనా

నీకు నాకు ముడి పెట్టిండే, రాత రాసి జతగట్టిండే
యేలు పట్టుకొని పాలు తిరిగి, నీ ఇంటిలోకి అడుగేస్తానే

పిల్లగా.. పిల్లగా నువ్వేడా ఉన్న నీ మీద పానమాయే
రా పిల్లగా నువ్వు లేకపోతే మనసంతా సిన్నవాయే
సిలకా నువ్వు పక్కనుంటే రోజంతా పండుగాయే
నా సిలకా నువ్వు లేకపోతే నా బతుకు దండుగాయే

_______________________

Song Credits:

సాంగ్ : సిలకా పిల్లగా (Silaka Pilaga)
నటీనటులు : కిర్రాక్ నాని (Kirrak Nani) – ఝను భూపతి (Jhanu Bhupathi)
నిర్మాత : కె.శ్రీనివాస్ – కవిత (Kavitha)
డైరెక్షన్, ఎడిటింగ్ & డిఐ – కిర్రాక్ నాని (Kirrak Nani)
కొరియోగ్రాఫర్ – శిశాంత్ (Shishaanth)
సాహిత్యం – రాజు తాడూరి (Raju Thaduri)
గాయకుడు & సంగీతం – అజయ్ మెంగాని (Ajay Mengani)
మహిళా గాయని – శ్రీనిధి (Srinidhi)

See Also plz click on this: sitti-silaka-song-lyrics-sai-adhit

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like