సాంగ్ శివ శివ శంకర (Shiva Shiva Shankara) సినిమా కన్నప్ప (Kannappa) లోని ఒక శక్తివంతమైన భక్తిగీతం. ఈ పాటలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో కనిపించగా, విజయ్ ప్రకాష్ గాత్రం అందించారు. సంగీతాన్ని స్టీఫెన్ దేవస్సీ అందించగా, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి రచించారు. కథ మరియు స్క్రీన్‌ప్లే విష్ణు మంచు రాయగా, నిర్మాతగా డా. ఎం. మోహన్ బాబు వ్యవహరించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
Shiva Shiva Shankara song lyrics:
తెలివి కన్ను తెరుసుకుందయ్యా
శివలింగమయ్యా
మనసు నిన్ను తెలుసుకుందయ్యా
మాయ గంతలు తీయ్యా
తెలివి కన్ను తెరుసుకుందయ్యా
శివలింగమయ్యా
మనసు నిన్ను తెలుసుకుందయ్యా
మాయ గంతలు తీయ్యా
మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు
ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు
నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి
నన్నింకోక్క నాందిగా మూడేయ్యి నీ గాటికి
ఏ జనుము పుణ్యమో నిన్ను చేరుకుంటిరా… ఆ
శివ శివ శంకర
సాంబ శివ శంకర
హరోమ్ హర హరహర
నీలకంటారా
స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలోన
లింగమయ్య నీవే నాకు దోచినావుగా
దారెంట … కొమ్మలు శివ శూలాలే
మబ్బులో… గీతలు నీ నామాలే
లోకమంతా నాకు శివమయమే
యాడ చూడు నీ అనుభవమే
ఓంకారము పలికినవి పిల్ల గాలులే…
ఎండిన ఈ గుండెలు వెన్నెల చేరువాయెరా
నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా
శివ శివయ్యను పేరుకు పెనవేసుకుంటిరా…. ఆ
శివ శివ శంకర
సాంబ శివ శంకర
హరోమ్ హర హరహర
నీలకంటారా
ఓ.. కొండ వాగు నీళ్లు నీకు లాలపోయానా..
అడివి మల్లె పూలదండ అలకరించనా
నా ఇంటి… చంటి బిడ్డవు నువ్వు
ముపొద్దు… నీతో నవ్వుల కొలువు
దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా
ఓ శివయ్య .. ఇప్ప తేనే ఉంది విందు చేయనా
నిన్ను సాకుతా కొనసాగుతలే బ్రతుకు పొడుగునా… ఆ
ఎండకు జడివానకు తట్టుకుని ఎట్టుంటివో
చలి మంచుకు విల విల ఏ పాటు పడితివో
ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా….
కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య
ఆస్తిపాస్తులన్నీ నీవి కరిగిపోతాయా
ఏమైనా… నీకు న్యాయంగుందా
ఈ పైన.. నిన్ను వదిలేదుందా
ఎట్టగట్టనో తల తిరిగి
మొగసిన తపమంతా కరిగి
శివయ్య నీ సిగమూడిలో సింకుకుంటిరా… ఆ
బామ్మనీ ఇదిలించిన.. కసురుతూ కరిగించిన
శులముతో పొడిచిన.. పాములు కరిపించిన
నిన్నొదిలితే నా పెరిక తిన్నడే కాదురా… ఆ
శివ శివ శంకర
సాంబ శివ శంకర
హరోమ్ హర హరహర
నీలకంటారా
హరహర హరహర హరహర హరహర హరనే శివనే
హర హర శంకర
శివ శివ శంకర
శంకర శంకర శివ శివ శంకర
హర హర శంకర
శివ శివ శంకర
శంకర శంకర శివ శివ శంకర
హర హర శంకర
శివ శివ శంకర
శంకర శంకర శివ శివ శంకర
శంకర… శివ శంకర
శివ…. శివా…. ఆ
Song Credits:
సాంగ్ | శివ శివ శంకర (Shiva Shiva Shankara) |
ఆల్బమ్/సినిమా | కన్నప్ప (Kannappa) |
నటుడు | విష్ణు మంచు (Vishnu Manchu) |
గాయకుడు | విజయ్ ప్రకాష్ (Vijay Prakash) |
సంగీత దర్శకుడు | స్టీఫెన్ దేవస్సీ (Stephen Devassy) |
గీతరచయిత | రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) |
కథ & స్క్రీన్‌ప్లే | విష్ణు మంచు (Vishnu Manchu) |
నిర్మాత | డా.ఎం. మోహన్ బాబు (Dr.M. Mohan Babu) |
దర్శకుడు | ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) |
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.