సిటీ గొట్టే అరె సిటీ గొట్టే
అరె సిటీ గొట్టే సిటీ గొట్టే దొంగ నారి గాడు
సిటీ గొట్టి సినిమా కెళ్లే దొంగ నారి గాడు
సిటీ నేను కొట్టలేదే ఓ బాలమణి
సినిమా చూసి వస్తనే పిల్ల నా బాలమణి
గోళ్ళ పిచ్చే గోళ్ళ పిచ్చే దొంగ నారి గాడు
గోళ్ళ పిచ్చి బొంబై చేరే దొంగ నారి గాడు
బోరు బోరు మనకే పిల్లో నా బాలమణి
బొంబై చూసి వస్తానే పిల్ల నా బాలమణి
అరె సిటీ గొట్టే సిటీ గొట్టే దొంగ నారి గాడు
సిటీ గొట్టి సినిమా కెళ్లే దొంగ నారి గాడు
అరె పాసే జేసే పాసే జేసే దొంగ నారి గాడు
పాసే జేసి పట్నం జేరే దొంగ నారి గాడు
పాసే నేను చేయనే పిల్ల నా బాలమణి
పట్నం చూసి వత్తనే పిల్ల నా బాలమణి
కల్లుతాగే సారా తాగే దొంగ నారి గాడు
సారా తాగి సందుల పాయే దొంగ నారి గాడు
కల్లుసారా తాగలేనే ఓ బాలమణి
సక్కనైన పిల్లగాడ్నే నా బాలమణి
అరె సిటీ గొట్టే సిటీ గొట్టే దొంగ నారి గాడు
సిటీ గొట్టి సినిమా కెళ్లే దొంగ నారి గాడు
నారి గాడు నారి గాడు
అరే దుంకులాడే దుంకులాడే దొంగ నారి గాడు
దుంకులాడి దుబాయ్ చేరే దొంగ నారి గాడు
దుడ్డుపని చెయ్యనోన్నే ఓ బాలమణి
దుబాయ్ చూసి వత్తనే భామ నా బాలమణి
గంతులేసే గంతులేసే దొంగ నారి గాడు
గంతులేసి గాయం పెట్టె దొంగ నారి గాడు
పిల్ల గంతులు నేనెయ్యలేదే నా బాలమణి
గాయం నీకు పెట్టనే భామ నా బాలమణి
అరె సిటీ గొట్టే సిటీ గొట్టే దొంగ నారి గాడు
సిటీ గొట్టి సినిమా కెళ్లే దొంగ నారి గాడు
అరె సంధులెల్లి మందిల పాయె దొంగ నారి గాడు
సాటుకెళ్ళి సైల చేసే దొంగ నారి గాడు
సైల నేను చెయ్యలేదే నా బాలమణి
సరుకుల కంటోస్తినే పిల్ల నా బాలమణి
ఎన్ని రోజులు ఎదిరి సూతు దొంగ నారి గాడ్ని
ఏలనోడు ఏటిలాపోని దొంగ నారి గాడు
అబ్బా ఏలనని అనకే భామ ఓ బాలమణి
ఏలు పట్టి తాళి కడతా నా బాలమణి
ఎల్లకాలం ఏంటే ఉంటా నా బాలమణి
కలకాలం కలిసుందామె నా బాలమణి
_________________
గేయ రచయిత – ఉషక్క (Ushakka)
నిర్మాత: సందీప్ (Sandeep)
గానం: ఉషక్క (Ushakka) & బొడ్డు దీలీప్(Boddu Deelip)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ (Shekar Virus)
నటులు: రాము రాథోడ్ (Ramu Rathod), బిట్టు డాన్సర్ (Bittu Dancer)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.