శ్రీరాముడే శివధనుసునే విరిచింది శ్రీరాముడే
శ్రీరాముడే సీత మనసునే దోచింది శ్రీరాముడే
శ్రీరాముడే లోకకళ్యాణమాడింది
శ్రీరాముడే రావణుని సంహరించింది
శ్రీరాముడే భక్తినే మెచ్చి బంటుడని హనుమంతుని ఎదలో కొలువున్నాడే
శ్రీరాముడే రఘురాముడే శ్రీ రామ రాజ్యానికే దేవుడే
పుట్టినింటి గడప దాటే పుత్తడి బొమ్మ
మెట్టినింట అడుగు పెట్టె ముద్దుల గుమ్మ
పుట్టినింటి గడప దాటే పుత్తడి బొమ్మ
మెట్టినింట అడుగు పెట్టె ముద్దుల గుమ్మ
సీతమ్మ నవ్వులే సిగ్గుల్లో అందమే
కటుకైనా కన్నులే కోరుకుంది బంధమే
ఒకటైయేను జత కలిసెను సరి కొత్త జంటనే
సీతారాముల కళ్యాణం కమనీయం
వేదమంత్రాల మాంగళ్యం మహనీయం
సీతారాముల కళ్యాణం కమనీయం
వేదమంత్రాల మాంగళ్యం మహనీయం
మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యెను
ఏడు అడుగులు నడిచిన సీత వధువు అయ్యెను
మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యెను
ఏడు అడుగులు నడిచిన సీత వధువు అయ్యెను
తల పైన ఒట్టు వేసి తలంబ్రాలు పోయగా
జనులెల్ల పెళ్లి చూసి అక్షింతలేయగా
సీతమ్మ తోడుగా రామయ్య అండగా
నూరేళ్లు నిండుగా ఉండాలి చల్లగా
పంచభూతాలే అతిథులై ఆశీర్వదించగా
సీతారాముల కళ్యాణం కమనీయం
వేదమంత్రాల మాంగళ్యం మహనీయం
సీతారాముల కళ్యాణం కమనీయం
వేదమంత్రాల మాంగళ్యం మహనీయం
చరితలో నిలిచెనులే అదిగో రామాయణం
చేరిపిన చేరగదులే ఇద్దరి ప్రేమాయణం
చరితలో నిలిచెనులే అదిగో రామాయణం
చేరిపిన చేరగదులే ఇద్దరి ప్రేమాయణం
రామయ్య జాతకంలో సీతమ్మ జీవితం
తొలి ప్రేమ పరిచయంతో ఈ పెళ్లి పుస్తకం
పారాణి పాదము కడదాకా పయనము
బ్రహ్మ ముడి ముహూర్తము కలిపింది బంధము
ఐదు రోజుల పెళ్లి వేడుక ఆనంద భరితము
సీతారాముల కళ్యాణం కమనీయం
వేదమంత్రాల మాంగళ్యం మహనీయం
సీతారాముల కళ్యాణం కమనీయం
వేదమంత్రాల మాంగళ్యం మహనీయం
సాంగ్ క్రెడిట్స్ :
సాంగ్: సీతా రాముల కల్యాణం కమనీయం (Seetha Ramula Kalyanam Kamaneeyam)
సాహిత్యం: కపిల్ మద్దూరి (Kapil Madduri)
గాయకుడు: కార్తీక జాదవ్ (Karthika Jadhav)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
కొరియోగ్రఫీ: రాజేష్ పైండ్ల (Rajesh Paindla)
నటీనటులు : శివకృష్ణ వెలుతురు (Shivakrishna Veluthuru) & బ్రమరాంబిక (Bramarambika)
నిర్మాతలు : సాయి కుమార్ గౌడ్ (Sai Kumar Goud) & రాజేష్ గౌడ్ (Rajesh Goud)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.