Home » సీనయ్యా – సీనయ్యా

సీనయ్యా – సీనయ్యా

by Haseena SK
0 comments

ఎర్రటి ఓణీకట్టీ
పచ్చటి జుంకాలెట్టీ
నల్లటి కాటుకపెట్టీ
తెల్లటి మల్లెలు సుట్టీ

రంగురంగు ముగ్గువోలే
ముస్తాబయ్యీ

నీతో వచ్చెయ్యనా

చెంగుచెంగు దూకుతున్న
అందాలన్నీ

నీకే ఇచ్చెయ్యనా
రంగురంగు ముగ్గువోలే
ముస్తాబయ్యీ

నీతో వచ్చెయ్యనా

చెంగుచెంగు దూకుతున్న
అందాలన్నీ

నీకే ఇచ్చెయ్యనా

ఎంత ముద్దుముద్దుగున్నావయ్యో
బావా సీనయ్యా

నిన్ను సూడకుండ వుండలేనయ్యో
రావా సీనయ్యా

ఎంత ముద్దుముద్దుగున్నావయ్యో
బావా సీనయ్యా
నిన్ను సూడకుండ వుండలేనయ్యో
రావా సీనయ్య

మెరిసే ముక్కూపుడకా
సిలుకూ రిబ్బను ముక్కా
నడుమే పువ్వుల రెక్కా
నలిగేను నువ్వేలేకా

రెండు కళ్ళలోన లక్ష వొత్తులు పెట్టీ
ఎదురే చూస్తున్నా

మట్టిగాజులేసుకుని ఘల్లూ ఘల్లూ
కబురే పంపుతున్నా

రెండు కళ్ళలోన లక్ష వొత్తులు పెట్టీ
ఎదురే చూస్తున్నా

మట్టిగాజులేసుకుని ఘల్లూ ఘల్లూ
కబురే పంపుతున్నా

ఎంత ముద్దుముద్దుగున్నావయ్యో
బావా సీనయ్యా

నిన్ను సూడకుండ వుండలేనయ్యో
రావా సీనయ్యా

ఎంత ముద్దుముద్దుగున్నావయ్యో
బావా సీనయ్యా

నిన్ను సూడకుండ వుండలేనయ్యో
రావా సీనయ్యా

రింగూ రింగుల జుట్టూ
గుండ్రం గుండ్రం బొట్టూ
చెంపల్లో సిగ్గుల చెట్టూ
బెంగెట్టుకున్నాయి ఒట్టూ

నీ చూపులొచ్చి నన్ను గుచ్చకపోతే
అస్సలు నచ్చదురా

నువ్వు ప్రేమతోటి నన్ను తిట్టకపోతే
నిద్దర పట్టదురా

నీ చూపులొచ్చి నన్ను గుచ్చకపోతే
అస్సలు నచ్చదురా

నువ్వు ప్రేమతోటి నన్ను తిట్టకపోతే
నిద్దర పట్టదురా

నువ్వు ఎక్కడెక్కడున్నావయ్యో
బావా సీనయ్యా

నువ్వు ఎప్పుడెప్పుడొస్తావయ్యో
రావా సీనయ్యా

నువ్వు ఎక్కడెక్కడున్నావయ్యో
బావా సీనయ్యా

నువ్వు ఎప్పుడెప్పుడొస్తావయ్యో
రావా సీనయ్యా

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment