మన సనాతన ధర్మం వెనుక ఎంతో ప్రాచీనమైనది. మన పేదలు చెప్పిన ప్రతి ఒక్క మాట వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ కారణమే ఉంది. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రతి గుడిలోని గోపురానికి పైన కలశాల ను చూసే ఉంటాము. ఆ కలశాల ను ఎందుకు పెడతామో తెలుసా. ఈ సంచికలో ఆ కలశాల కు వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం రండి.
గోపురం పైన కళాశాలను పెట్టడం వెనుక ఉన్న కారణాలు:
ఈ గోపురాల పైన కళాశాలను పెట్టడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఇక్కడ కింద తెలుపబడ్డాయి చదివేయండి.
కళాశాలను తయారు చేసిన లోహాలు:
ఈ కలశాలను పంచ లోహాలతో తాయారు చేస్తారు అవే బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు జింక్. ఈ లోహాలకు ఎలక్ట్రో-మాగ్నెటిక్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. ఈ అయిదు లోహాలతో చేసిన కలశాలు రాత్రి పూట చంద్రుడు నుంచి వచ్చే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ని గ్రహించి వాటిలో స్టోర్ చేసుకుంటాయి. భూమికి ఉన్న ఆకర్షణ శక్తీ కారణంగా ఆ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీ కిందకు వస్తుంది.
మనం గుడిలో అడుగు పెట్టినప్పుడు వెంటనే ఆ మాగ్నెటిక్ ఎనర్జీ మన శరీరం లోకి ప్రవహిస్తుంది. అప్పుడు మన మెదడు లోని ఫంక్షన్స్ అన్ని బాలన్స్ అవుతాయి. అందుకే మనకు గుడిలో చాల ప్రశాంతంగా అనిపిస్తుంటుంది.
రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం:
ఆలయాలలో కలశాల ను పెట్టె అప్పుడు వాటిలో వరి, మొక్కజొన్న, రాగులు, నువ్వులు, మినుములు వంటి ధాన్యాలతో ఆ కలశాల ను నింపుతారు. ప్రతి గుడిలోని గోపురానికి పైన కొన్ని కలశాల కు ఉంటాయి. ఈ ధాన్యాలు అన్ని కలిపి సుమారు 50 కేజీ వరకు ప్రతి ఒక కలశం లో ఉంటాయి. ఇలా ధాన్యాలను కలశాల లో పెట్టడం వెనుక కారణం కూడా ఉంది.
పూర్వం రాజులూ వాళ్ల రాజ్యంలో ప్రజలను కరువు సంభవించినప్పుడు కాపాడుకునేందుకు కళాశాలలో ఇలా ధాన్యం నింపేవారు. ఈ ధాన్యాలలో 12 సంవత్సరాల వరకు జీవం ఉంటుంది కనుక వాటిని ఆ వ్యవధిలో పంటలను పండించడానికి విత్తనాలు లాగా కూడా వాడే వారు. ఈ కళాశాలలోని ధాన్యాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలలకు ఒకసారి మారుస్తూ ఉంటారు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.