సత్యము జ్యోతి వెలుగునయ (Satyam Jyothiga Velugunaya) భజన పాట లిరిక్స్

by Lakshmi Guradasi

శో||     శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పా

    శబరిగిరీశ అయ్యప్పా స్వామి యే శరణం అయ్యప్పా        శర||

1.    సత్యము జ్యోతి వెలుగునయ – నిత్యము దానిని చూడుమయా

    పరుగున మీరురారయ్య – శబరిగిరికి పోవుదుము           శర||

2.    హరి హర మానస సుతులైన – సురలా మొరలను ఆలకించి

    ధరణిలో తాను జన్మించి – పదునాల్గేళ్ళు నివశించి           శర||

3.    ఘోర అడవిలో బాలునిగా – సర్పము నీడలో పవళించి     

    వేటకు వచ్చిన రాజునకు – పసిబాలునిగా కనిపింప          శర||

4.    మణికంఠ అను  నామముతో – పెంచిరి రాజులు మురిపెముగా

    స్వామి మహిమతో రాజునకు-కలిగెను సుతుడు మరియొకడు శర||

5.    గరువాసములో చదివింప – గురుపుత్రుని దీవింప

    మాటలు రానీ బాలునకు మాటలు వచ్చెను మహిమలతో      శర||

6.    మాతాపితలను సేవించి – మహిషిని ఆను వధియించి

    శబరిగిరిలో వెలసిరాగా  – మనలను ధన్యుల చేయుటకు     శర||

7.    అయ్యప్పా అను నామముతో – శిలారూపమున తానున్నా

    జ్యోతి స్వరూప మహిమలతో – భక్తుల కోర్కేలు తీర్తురయ     శర||

8.    మార్గశిరాన మొదలెట్టి – నలుబది దినములు దీక్షతో

    శరణను భజనలు చేయుచు – ఇరుముడి కట్టి పయనింప     శర||

9.    భోగికి ముందు చేరాలి – పంబలో స్నానం చేయాలి

    పదునెట్టాంబడి ఎక్కాలి – స్వామిని మనమూ చూడాలి        శర||

10.    మకర సంక్రాతి దినమున – సాయం సమయం వేళలో

    సర్వం వదలిన సత్పురుషులకు – జ్యోతి దర్శనం మిచ్చునయా  శర||

11.    మకర జ్యోతిని చూడాలి – తిరువాభరణం చూడాలి

    చాలు చాలు మనికింక – వలదు వలదు ఇక మరు జన్మ     శర||

12.    నెయ్యభిషేకం స్వామికే – తేనాబిషేకం స్వామిక్కే

    చందనాభిషేకం స్వామిక్కే – పూలాభిషేకం స్వామిక్కే         శర||

13.    కూర్పరహరతీ తనకెంతో – పాయసమంటే మరియెంతో

    శరణన్న పదములు ఎంతెంతో – యిష్టం యిష్టం స్వామికే     శర||

14.    హరిహరాసనం స్వామిది – సుందర రూపం స్వామిది

    కన్నుల పండుగ మనదేలే – జన్మ తరించుట మనకేలే     శర||

15.    శరణం శరణం అయ్యప్పా – శరణం శరణం శరణమయా

    శరణం శరణం మాస్వామి – దరికి చేర్చుకో మాస్వామీ     శర|| 

See Also plz click on this: uyyala-luguthunnadu-song-lyrics-ayyapa-bhajanalu

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like