శరణం శరణమయ్యా శంకరా | saranam saranamayya shankara song lyrics

by Lakshmi Guradasi

శరణం శరణమయ్యా శంకరా
నీ కరుణ చూపి రావయ్యో శంకరా (2)
వరాలిచ్చే దొరనివే ఈశ్వరా
నీకు కరములెత్తి మొక్కినాము ఈశ్వరా (2)

పార్వతి రమణ పరమ దయకార
నీ పాద సేవే నిరతము మరువని
మా పాప కర్మలు ఎడబాప రావయ్యా
మా శాప బంధాలు తొలగించరావయ్య (2)

స్వామి…
నీకు పాలాభిషేకాలు శివయ్యా
మా పున్నాగ భూషణ రావయ్యా (2)

శరణం శరణమయ్యా శంకరా
నీ కరుణ చూపి రావయ్యో శంకరా (2)

అదిగిరీషా అనాధ రక్షకా అనుక్షణం నీ నామమే మరువని
మా అష్ట కష్టాలు కడదేర్చ రావయ్యా
అష్ట సిరులిచ్చి ఆదరించాలయ్యా (2)

స్వామి…
నీకు నెయ్యభిషేకమే శివయ్యా
త్రి నేత్రధారహర రావయ్యా (2)

శరణం శరణమయ్యా శంకరా
నీ కరుణ చూపి రావయ్యో శంకరా (2)

గంగాధరహర లింగస్వరూపుడా
నీ గానమే మా ప్రాణంగా తలిచి
మా బావ బంధాలు బాపంగా రావయ్యా
మా బాధలన్నీ నువ్వు తీర్చంగా రావయ్యా (2)

స్వామి…
నీకు పుష్పభిషేకమయ్యా శివయ్యా
నీకు భస్మాభిషేకమయ్యా రావయ్యా (2)

శరణం శరణమయ్యా శంకరా
నీ కరుణ చూపి రావయ్యో శంకరా (2)
వరాలిచ్చే దొరనివే ఈశ్వరా
నీకు కరములెత్తి మొక్కినాము ఈశ్వరా (2)

శరణం శరణమయ్యా శంకరా
నీ కరుణ చూపి రావయ్యో శంకరా (2)

______________________

Song Credits:

పాట పేరు : శరణం శరణమయ్యా (saranam saranamayya)
గానం : ఆకునూరి దేవయ్య (Akunuri Devayya)
సంగీతం: జి.ఎల్. నామ్‌దేవ్ (G. L. Namdev)
సాహిత్యం: మద్దివేని శ్రీనివాస్ (Maddiveni Srinivas)

See Also plz click on this: deepala-kanthullo-daga-daga-merise-anjanna-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like