సప్పబడే పానము సప్పుడెప్పుడు
నీకు నాకు పిల్లగా మనుము అయ్యేదెప్పుడు
లవ్వు ముదిరిపాయే పిల్లగా లగ్గమెప్పుడు
లగ్గాల మోగే డప్పు సప్పుడెప్పుడు
ఎప్పుడూ ఆ సప్పుడు సప్పుడు
ఎప్పుడూ ఆ సప్పుడు సప్పుడు
ఎప్పుడూ ఆ సప్పుడు సప్పుడు
ఎప్పుడూ ఆ సప్పుడు సప్పుడు
ఇంటివాళ్ళనొప్పించి ఒక్కటయ్యేదెప్పుడు
పంతులయ్య పత్రికల్ల పేరు రాసేదెప్పుడు
సక్కనైన మన జంట సక్కరకొరిగే ఎప్పుడు
పానమాగతాలేదు పైడి డప్పులేప్పుడు
నీకు నాకు లగ్గమని సెప్పుకున్న గొప్పలును
సప్పుడు చేయకుండా ఉంటే సెప్పలేనె తిప్పలు
ఎప్పుడూ సప్పుడెప్పుడు ఎప్పుడు
ఎప్పుడూ సందడేప్పుడు ఎప్పుడు
ఎప్పుడూ సప్పుడెప్పుడు ఎప్పుడు
ఎప్పుడూ సందడేప్పుడు ఎప్పుడు
(అహే మంచి ఊపున్న బీటెయ్యరా
నీ సప్పుడికి అక్క స్టెప్పుకి స్టేజి దద్దరిల్లిపోవాలా)
(అద్ది లెక్క )
ఎరా అంటే ఎదురుచూసే ఎదురుకోళ్లు ఎప్పుడు
మామిడాకుల పందిరికింద కూసుండేదెప్పుడు
బాసింగాలు గట్టుకుని బాసలాడేదెప్పుడు
జీలకర్ర బెల్లము నెత్తినెట్టేదెప్పుడు
పాణిగ్రహం తోని పదవి అయ్యేది ఎప్పుడు
నీ ఏళ్ళతోని ఎండి మట్టెలుబెట్టేదెప్పుడు
నీ పాదసేవ జేసుకుంటాబతికేదెప్పుడు
ఎప్పుడూ పిల్లగా ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడూ తాళి కట్టుడు కట్టుడు
ఎప్పుడూ సప్పుడెప్పుడు ఎప్పుడు
ఎప్పుడూ పిల్లగా ఎప్పుడూ ఎప్పుడు
అరుంధతి నక్షత్రాన్ని జూసేది ఎప్పుడు
అత్త మామ కాళ్ళు మొక్కి ఇంట్ల అడుగుబెట్టుడు
ఆశలన్నీ ఆ దేవుడు తీర్చేది ఎప్పుడు
నిన్ను కలిసే పానమంతా నీళ్లయే ఇప్పుడు
వేచి కాచి దాచినట్టి అందాలు ఇచ్చుడు
మదిలో ఉన్న కోరికలు మంచానికి చెప్పుడు
ఎప్పుడూ డి జె సప్పుడు సప్పుడు
ఎప్పుడూ బ్యాండు కొట్టుడు కొట్టుడు
ఎప్పుడూ సప్పుడెప్పుడు ఎప్పుడు
ఎప్పుడూ డి జె సప్పుడు సప్పుడు
ఎప్పుడూ బ్యాండు కొట్టుడు కొట్టుడు
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.