ఆయో ఆయో ఆయోరే
మంగళ్ మంగళ్ జాయోరే
ఆయో సంక్రాంతి ఆయోరే
ఆయో ఆయో ఆయోరే
మంగళ్ మంగళ్ జాయోరే
ఆయో సంక్రాంతి ఆయోరే
తులసమ్మక్క నరసమ్మక్క
గిరిజక్క గీతక్క
పండిందే మన పంటా
ఓ కొడవలి పట్టి కోసిన పంట
ఇంటికొచ్చినాక పండగ జరగాలంట
నల్ల రేగళ్ల బంగారాలే నిండు నట్టిల్లు
పూల గొబ్బిళ్ల సింగరాలే పల్లె ముంగిళ్లు
సామిరంగ ఏడాది కష్టమంతా
అదృష్టమై ఊరంతా కోలాటం ఆడిందే
కోలమ్మ కోలో సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా
సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా
ఏ దేశమైనా ఎక్కడైనా
తెలుగోడి చెయ్యే పైచేయిలే పైచేయిలే
తెలుగోడి సత్త తెలసేలా
ఓళ్ళొంచి పని చెయ్యాలిలే
మనదైనా సంప్రదాయం
మన్ను దున్నే వ్యవసాయం
ఎంతెత్తులోన ఎదిగి ఉన్న
మూలాలు మార్చిపోములే
కోలమ్మ కోలో సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా
గొబ్బియాల్లో గొబ్బియాల్లో గొబ్బిగౌరమ్మ
పుణ్యమిస్తాది పూజలు చేద్దాం రాయే చిలకమ్మ
నువ్వు కలగన్న కోరికలన్నీ తిరేనోయమ్మ
నీకు మనసైన వాడే నిన్ను మనువడేనమ్మా
ఆకళ్ళు తీర్చే అన్నదాత
రైతన్నే కదా ఏనాటికి ఏనాటికి
రైతన్న చల్లంగుంటే చాలు
లోటంటు లేదు లోకానికీ…
మట్టి కోసం పుట్టినోళ్లు
మంచి పంచె పల్లెటూళ్లు
ఈ రోజు లాగే ఏ రోజైనంతే
మంచి రోజులు రావాలే
కోలమ్మ కోలో సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
కోటి సరదలు సందళ్ళు తెచ్చిందిరా
మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా
మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా
___________________________
సినిమా పేరు: రూలర్ (Ruler)
దర్శకుడు: KS రవి కుమార్ (KS Ravi Kumar)
సంగీత దర్శకుడు: చిరంతన్ భట్ (Chirantann Bhatt)
గాయకులు: స్వరాగ్ కీర్తన్ (Swaraag Keerthan), రమ్య బెహరా (Ramya Behara)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Shastry)
నటీనటులు: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) & సోనాల్ చౌహాన్ (Sonal Chauhan)
నిర్మాత: సి.కల్యాణ్ (C.Kalyan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.