సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా
నను మరవని చూపులెన్నెన్నో నను నడిపిన దారులెన్నెన్నో
నను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
ముగ్గుమీద కాలు వెయ్యగానే రయ్యిమంటూ కయ్యిమన్న
ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం
భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి
ఒంటినే వెచ్చగా తాకుతోంది
తంబురాలతో చిడత పాడెనంట
గంగిరెద్దులాటలో డోలు సన్నాయంట
పెద్ద పండగొచ్చెనోయంటూ ముస్తాబుఅయ్యింది చూడరా ఊరు ఇచ్చటా
ఇంటిగడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి
రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికీ
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఓ….
దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద
కూరలాగా తాను మాడిపోదా పాపం
నేల మీది నుండి గాలిపటం నింగి దాకా
దారమే తోకగా ఎగురుతుంది
ఎడ్ల బండిపై ఎక్కు చిన్నా పెద్దా గోలగోల చెయ్యడం ఎంత బాగుందంట
రోజు మారిపోయినాగాని తగ్గేది లేదంటా అంతటా సంబరాలే
విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి
అంతమందినొక్కసారి కలవడానికి చాలవంట మూడు రోజులు
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఆ ఆఆ
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఓ…
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
__________________________
పాట : సందల్లె సందల్లె (Sandalle Sandalle)
చిత్రం – శ్రీకరం (Sreekaram)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
సాహిత్యం : సనాపతి భరద్వాజ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu)
గానం : అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), మోహన భోగరాజు (Mohana Bhogaraju)
నటీనటులు – శర్వానంద్ (Sharwanand), ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan),
చయిత & దర్శకుడు: కిషోర్.బి (Kishor.B)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.