Home » సంబరాల సంకురాత్రి సాంగ్ లిరిక్స్ ఊరంతా సంక్రాంతి 

సంబరాల సంకురాత్రి సాంగ్ లిరిక్స్ ఊరంతా సంక్రాంతి 

by Lakshmi Guradasi
0 comments
Sambaraala Sankuratri song lyrics Oorantha Sankranthi

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడమగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ

అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి గంధాలు పూసేను
అరెరెరెరె లోగిల్లలోన సిగ్గులన్ని వెల్లలేసె ప్రేమ రంగులేసె
కన్నెపిల్లలో సోకు పండిందని కాకు కావాలని తోడు రావాలని

అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి గంధాలు పూసేను
ఆ.. అల్లీ అల్లని పందిట్లో అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని

హొయ్ సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడమగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ

ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ

వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను
సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను
కల్లల్లోని ఆశలన్ని కొండాకొచ్చి వెయ్యి ముడుపులిచ్చి
గుండె చాటు కలలన్ని తీరాలని వలపు సాగాలని రేవు చేరాలని
హొయ్

వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను
సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను
నవ్వీ నవ్వని నవ్వుల్లో తెలిసి తెలియని ఒరవళ్ళు
కలిసీ కలవని కళ్ళల్లో తీరి తీరని ఆకళ్ళు
తీరే రోజు రేపోమాపో రావాలని

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడమగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.