సక్కని మా శివయ్య (sakkani ma sivaya) సాంగ్ లిరిక్స్ | Tanikella Bharani

by Lakshmi Guradasi

సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్య
పక్కనుండే పార్వతీ పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా
కరి తోలు పడి నాగుల ఆవాసమేందయ్య
జోలి బట్టిన జగమయ్య నీ వేషమేందయ్యా
మంచు కొండ నీ ఇల్లయ్యా వెండి సందమామ సిగనయ్య

సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్య
పక్కనుండే పార్వతీ పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా

జడలే చిక్కు ముడుల మాసెనేందయ్యా
అటు ఇటు కాని కన్ను నుదుట నేందయ్యా
నెలపొడుపు సందమామ నెత్తినేందయ్యా
రూపముండి నీకు లింగపూజలేందయా
విషమే గొంతులో ఎట్టా నిలుపుకున్నావో
కాటి బూడిదని ఎట్టా బూసుక్కుంటావో

విషమే గొంతులో ఎట్టా నిలుపుకున్నావో
కాటి బూడిదని ఎట్టా బూసుక్కుంటావో
నువ్వ్ ఎట్ట బడితె అట్ట ఉంటే అమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా
పార్వతమ్మే ఎట్టా చూస్తూ ఉందయ్యా

సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్య
పక్కనుండే పార్వతీ పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా

కొడుకు తలని ఎట్టా నరికినావయ్యా
వైరాగ్యాన్ని ఎట్టా మోసినావయ్యా
పిల్లనే ఇచ్చిన మామని సంపడమేందయ్యా
భూతగణాలతో సావాసమేందయ్యా
బస్మ్మాసురుని కెట్టా అట్టాంటి వరమిస్తివో
సతి పార్వతి నీతో ఎట్టా వేగుతున్నదో

బస్మ్మాసురుని కెట్టా అట్టాంటి వరమిస్తివో
సతి పార్వతి నీతో ఎట్టా వేగుతున్నదో
సెడ్డ కోపం వచ్చినా నిన్ను ఎట్టా తిట్టేదయ్య శివయ్య
నిన్ను గుండెల్లోనే పెట్టుకుంటినయ్యా

సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదల వేందయ్య
పక్కనుండే పార్వతీ పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like