Home » సక్కనైనవాడు సుక్కబొట్టులోడు సాంగ్ లిరిక్స్ – Folk Song

సక్కనైనవాడు సుక్కబొట్టులోడు సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comments
Sakkanainavaadu Sukkabottulodu song lyrics Folk Song

హోయ్ హోయ్ సుక్కాబొట్టులోడు హొయ్
సక్కానైనవాడు సుక్కాబొట్టులోడు అయినే నచ్చినాడే మేనబావా మెచ్చినాడే …
ముద్దుమురిపలోడు మూలామలుపు కాడ కన్నె కొట్టినాడే నా కొంగే పట్టినాడే ..

సక్కానైనవాడు సుక్కాబొట్టులోడు అయినే నచ్చినాడే మేనబావా మెచ్చినాడే …
ముద్దుమురిపలోడు మూలామలుపు కాడ కన్నె కొట్టినాడే నా కొంగే పట్టినాడే ..

మోట బావి కాడ నీల్లే తోడబోతే నడుమే నిమీరినాడే సొట్ట సెంపను గిల్లినాడే..
గిల్లి గిచ్చగానే సెంపల్ ఏర్రగయి సిగ్గులోలకవట్టే గానీ సుట్టే తిరగవట్టే..

మోట బావి కాడ నీల్లే తోడబోతే నడుమే నిమీరినాడే సొట్ట సెంపను గిల్లినాడే..
గిల్లి గిచ్చగానే సెంపల్ ఏర్రగయి సిగ్గులోలకవట్టే గానీ సుట్టే తిరగవట్టే..

కట్ట కాడ నే కట్టేలేరపోతే పట్టీల్ తెచ్చినాడే కాలుకి చుట్టే సుట్టినాడే..
గళ్ళు గళ్ళు మని పట్టీలాడుతుంటే గంతులేయబట్టే ఎదలో వింతలు మొదలుపెట్టే….

కట్ట కాడ నే కట్టేలేరపోతే పట్టీల్ తెచ్చినాడే కాలుకి చుట్టే సుట్టినాడే..
గళ్ళు గళ్ళు మని పట్టీలాడుతుంటే గంతులేయబట్టే ఎదలో వింతలు మొదలుపెట్టే…

నిండు నిమ్మల తోట నిమ్మాల్ ఏరబోతే కమ్మల్ తెచ్చినాడే సేవలకు దిమ్మల్ తొడిగినాడే..
చంగు చంగుమని కమ్మల్ ఊగుతుంటే సైగాల్ జేసినాడే సాటుకు రమ్మని పిలిసినాడే..

నిండు నిమ్మల తోట నిమ్మాల్ ఏరబోతే కమ్మల్ తెచ్చినాడే సేవలకు దిమ్మల్ తొడిగినాడే..
చంగు చంగుమని కమ్మల్ ఊగుతుంటే సైగాల్ జేసినాడే సాటుకు రమ్మని పిలిసినాడే..

సాటుకు రమ్మని పిలిసినాడే..
సాటుకు రమ్మని పిలిసినాడే..

____________________________

పాట: సక్కనైనవాడు సుక్కబొట్టులోడు (Sakkanainavaadu Sukkabottulodu)
లీడ్: లిఖిత (Likhitha)
లిరిక్స్ & ట్యూన్: సంతోష్ షెరి (Santhosh Sheri)
సంగీతం : విజయ్ దాసరపు ( Vijay Dasarapu)
సింగర్: దివ్య మాలిక (Divya Maalika)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.