సరిగ్గా సరిగ్గా ఆరైతే సఃకుటుంబానాం
సాయం సంధ్య వేళైతే సఃకుటుంబానాం
అయ్యయ్యో సూరీడు ఆగినా
హమ్మమ్మో వీడాగునా
అడ్డుగా సంద్రాలు పారినా
అడ్డడే వీన్నపునా
చెప్పు నువ్వు వెయ్యయినా
చెప్పుకో లక్షైనా
ఒక్కటే జవాబన్న
సఃకుటుంబానాం సఃకుటుంబానాం
సఃకుటుంబానాం సఃకుటుంబానాం
వెలుగు మసక ఒక్కటైతే సఃకుటుంబానాం
గువ్వ గూడు కలిసాయో సఃకుటుంబానాం
తక్కిన మిత్రులు మత్తులో చిందు వేళ
తండ్రికి మాత్రలు తెచ్చిపెడతాడోయ్
సందెల్లో అందరూ సంతసాలు పొందు వేళ
సంచులు తిప్పుతూ సంతకెళ్ళతాడే
ఎక్కడ ఏ బయటి భోజనం
ముట్టాడే ఏ రోజునా
ఎప్పుడు వీడింటి భోజనం
ఈ జనం తినాలనా
చప్పగా వంటున్న కొత్తగా ఉందంటూ
చెప్పలేదో దండనా
సఃకుటుంబానాం సఃకుటుంబానాం
సఃకుటుంబానాం సఃకుటుంబానాం
పడమటి రాగం వినిపిస్తే సఃకుటుంబానాం
పని పూర్తయినా కాకున్నా సఃకుటుంబానాం
పెదాల్ని ముద్దుగా వృద్ధ ఆశ్రమాలల్లోనా
పెట్టెడి బిడ్డలు ఉన్న రోజుల్లో
ఎంచక్క గుండెల్లో పెట్టుకుని సాగుతాడోయ్
పుస్తకముల్లోన అచ్చు వేయ్యాలోయ్
లెక్కలేదు ఉద్యోగం పోయినా
ఆపాడి ఆరాధన
లెక్కలేదు ఊపిర్లు పోయినా
ఊపిరే అయినోళ్ళనా
తల్లులు చెల్లెల్లు ఇంటికే దీపాలు
వత్తి విడాయాడన్న
హే హే సఃకుటుంబానాం సఃకుటుంబానాం
సఃకుటుంబానాం సఃకుటుంబానాం
అలిసే సమయం ఎదురైతే సఃకుటుంబానాం
పై అధికారే కాదన్నా సఃకుటుంబానాం
________________________
సాంగ్: సఃకుటుంబానాం (Sahakutumbaanaam)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
లిరిక్స్: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
నటీనటులు: రామ్ కిరణ్ (Raam Kiran), మేఘా ఆకాష్ (Megha Akash)
గాయకులు: S.P. చరణ్ (S.P. Charan), శృతిక సముద్రాల (Shruthika Samudhrala)
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఉదయ్ శర్మ (Uday Sharma)
నిర్మాతలు: హెచ్ మహదేవ్ గౌడ్ (H Mahadev Goud), హెచ్ నాగరత్న (H Nagarathna)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.