ఎవరో నువు
ఎదురైనా తొలి సహచరిలా కలిశావు
నా తోడు క్షణమైనా వీడవు
ఇన్నాళ్లుగా ఓ ఒంటరై నేనూ
ఏ బదులైన లేదు అని మిగిలాను ప్రశ్నలా
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా సహచరిలా
(సహచరిలా)
కన్నీళ్ళ చాటు ఆ గతం
ఆ జ్ఞాపకం గాయాన్నే చెయ్యగా
చిరునవ్వుతో తుడిచి వేయగా
సమయమే మార్చుననుగా
ప్రతి మాటకు బదులు నేర్పగా
ఉండాలి నువ్వే సదా
నీ ప్రేమకే ఓ పేరు అంటూ ఉందా
హృదయాల భాష ఇంతేగా
అది వింటే చాలదా
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా, సహచరిలా
నేనొక్క తెల్లకాగితం… నువు అక్షరం
చేశావు సంతకం
చిరు జీవితం ఎపుడు అంకితం
చేశావు వరమే కదా
సరిజోడుగా దొరికినావుగా
విడిపోని బంధం ఇదా
విశ్వాసమే నీ శ్వాసలోనే ఉందే
ఎన్నడు మరువలేను అదీ
నీ ప్రాణమే నాది
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా, సహచరిలా
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.