రాత రాసినోడే రాక్షసుడైతుంటే
రాయ్యోలే కూసున్న సూడవే
రాని దాని వంటూ రంది పెట్టుకున్న
ఒక్కసారి నన్ను చంపవే
నువ్వు కట్టుకున్న పట్టుచీర నే కొనక పోతినే
నీ చేతికున్న గాజులైన పెట్టే భాగ్యమెడదే
సితికి సితికి పోయి మనసు మతిల లేక
నేను కూసున్న పోతానా ఓ రామ చిలక
సచ్చిపోతనే నే సచ్చిపోతనే
నువ్వు అన్న తోడు లేకపోతే ఏమైపోతనే
నువ్వే రావనే మాటనే నమ్మనే
నే పోయే వరకు నీదే బతుకు బానిసనైననే
ఎవ్వరేమన్నారే నిన్ను పోస్తివే బతుకుల మన్ను
బుక్క బువ్వ నోటికి పోక పాణం పోతున్నదే
నిన్ను చూడకేట్ల ఉందునే
కళ్ళు పొడిసిపోయిన సత్తునే
కన్న వాళ్ళకైనా నేను భారం అయితినే
కూసున్న చోటల్లా కోసినట్టుగుందె
మనసు ముక్కలు చేసి పోతివేందే
సచ్చిపోతనే నే సచ్చిపోతనే
నువ్వు అన్న తోడు లేకపోతే ఏమైపోతనే
నువ్వే రావనే మాటనే నమ్మనే
నే పోయే వరకు నీదే బతుకు బానిసనైననే
నీకు మల్లె బాబు పుట్టాలే
నాకు మల్లె పాప పుట్టాలే
మంచి పేరు వాళ్ళకెట్టాలే
అన్న మాటలే..
బాగా నన్ను చూసుకోవాలే
బాధలన్నీ దాచుకోవాలే
మందితోని మంచిగుండాలని
ఎన్నో జెబ్బితివే..
అన్ని మరిచిపోయి అందరిలో గొప్పగా
కలిసి బతకాలని విడిసిపోతివేందే
సచ్చిపోతనే నే సచ్చిపోతనే
నువ్వు అన్న తోడు లేకపోతే ఏమైపోతనే
నువ్వే రావనే మాటనే నమ్మనే
నే పోయే వరకు నీదే బతుకు బానిసనైననే
ఎందుకిట్లా నాకు జేస్తివే
ఎన్నడిట్లా నాకు లేదాయే
వెన్ను పూస విరిగిపోయినట్టు
కింద పడితినే ..
ఎంత దూరం ఆలోచిస్తివే
ఎన్ని కలలు మనము కన్నమే
ఏమి దిక్కు నాకు లేకుండా ఏమైపోతివే
బతకాలో సావాలో తెలియక
సచ్చిన శవమోలే నేనున్నా ఏమిజేతునే
సచ్చిపోతనే నే సచ్చిపోతనే
నువ్వు అన్న తోడు లేకపోతే ఏమైపోతనే
నువ్వే రావనే మాటనే నమ్మనే
నే పోయే వరకు నీదే బతుకు బానిసనైననే
_______________________
లిరిక్స్: నాగరాజ్ కాసాని (Nagaraj Kasani)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera )
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth yadav)
దర్శకత్వం: ప్రశాంత్ APS (Prashanth APS)
నటీనటులు: సిరి రావుల చారిSiri (Ravula Chary), సందీప్ సుక్సేన (Sandeep Sucsena), ప్రసాద్ (Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.