Home » రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రారా బావ సాంగ్ లిరిక్స్ Folk 

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రారా బావ సాంగ్ లిరిక్స్ Folk 

by Lakshmi Guradasi
0 comments
Royal Enfield Meedha RaRa Bava song lyrics folk

బుగ్గన సుక్కనెట్టి తల నిండ పూలు పెట్టి
కళ్ళ కాటుకెట్టి కాళ్ళ పారాణి పెట్టి
పట్టు చీరకట్టి దగ దగ నగలు పెట్టా..

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
ఊరంతా దద్దరిల్లి మోగుతాది బ్యాండ్ బాజా

బుగ్గన సుక్కనెట్టి తల నిండ పూలు పెట్టి
కళ్ళ కాటుకెట్టి కాళ్ళ పారాణి పెట్టి
నుదుటున బొట్టు పెట్టి మేలొన తాళి కట్టా..

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
ఊరంతా దద్దరిల్లి మోగుతాది బ్యాండ్ బాజా

మా అమ్మ కళ్ళలో మెరిసే కాంతిని నేనై
మా అయ్యా గుండె గూటిలోన గువ్వను నేనై

మా అమ్మ కళ్ళలో మెరిసే కాంతిని నేనై
మా అయ్యా గుండె గూటిలోన గువ్వను నేనై
మా అన్నదమ్ముల్లా గారాల పట్టినై
మా అక్క చెల్లెల్లా అనురాగ బంధనై

మా అన్నదమ్ముల్లా గారాల పట్టినై
మా అక్క చెల్లెల్లా అనురాగ బంధనై
నేనే వాళ్ళకి పాణన్నంట
ఇక నువ్వే నాకు పాణం అంట

నేనే వాళ్ళకి పాణన్నంట
ఇక నువ్వే నాకు పాణం అంట

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
ఊరంతా దద్దరిల్లి మోగుతాది బ్యాండ్ బాజా

మా మెట్టింటి కోవెలకి దీపనౌతా
మా అత్తింటి మర్యాదకి మార్గానౌతా

మా మెట్టింటి కోవెలకి దీపనౌతా
మా అత్తింటి మర్యాదకి మార్గానౌతా
మా అత్త మమల్ని పూజించే పువ్వునై
మా ఆడ పడుచుల ఆత్మీయ బంధువునై

మా అత్త మమల్ని పూజించే పువ్వునై
మా ఆడ పడుచుల ఆత్మీయ బంధువునై
వల్లే నీకు పాణం అంట
ఇక మిరే నాకు పాణం అంట

వల్లే నీకు పాణం అంట
ఇక మిరే నాకు పాణం అంట

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
ఊరంతా దద్దరిల్లి మోగుతాది బ్యాండ్ బాజా

బుగ్గన సుక్కనెట్టి తల నిండ పూలు పెట్టి
కళ్ళ కాటుకెట్టి కాళ్ళ పారాణి పెట్టి
నుదుటున బొట్టు పెట్టి మేలొన తాళి కట్టా..

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద రయ్యిమంటూ రారా బావ
ఊరంతా దద్దరిల్లి మోగుతాది బ్యాండ్ బాజా..

_________________________

తారాగణం : శశి కుమార్ నాయక్ (SHASHI KUMAR NAYAK) & యమునా తారక్ (YAMUNA TARAK)
సాహిత్యం: SN జమ్ము (SN JAMMU)
సంగీతం: DJ శేఖర్ ఇచ్చోడ (DJ SHEKAR ICHODA)
గాయకుడు: స్నేహ కట్కూరి (SNEHA KATKURI)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.