ఊరే అల్లరిగుంది
గత్తర గత్తరగుంది
ఆహా అందరితో జాతరతో సందడిగుంది
నింగి మీదపడింది
నేల ఉలికి పడింది
రేగే రేగడితో ఆకాశమే ఎర్రబడింది
హే హే హుషారైన మజాలోన మతే చేడాలంతే
తమాషాగా తతంగాన తాలాడించాలంతే
చుట్టురా జనంతో రంగుల్లో హంగుల్లో
చెలరేగి చిందులేయాలే
దరువేయ్ రా ధన ధన ధన అందరూ తయ్యారన్న
లేదన్న తన మన ఈ క్షణాన
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కలన్న
ఆడుతు ఊగలన్న తెల్లారిన
నేను నువ్వని వేరు వేరని
ఎదో మూలాన ఒంటరై పడుంటే ఎలా
నాది నీదని ఎన్నో ఉండని
పోయేనాటికి వాటితో పనేలేదుగా
ఏవో తగాదాలు విబేధాలు మనకా అడ్డం
పిలిచే పెదాలొన నవ్వే మన అందరి చుట్టం
మామ స్థిరం లేని ప్రతిరోజు రంగుల రాట్నం
అయ్యో ఉసూరంటూ ఉన్నావంటే చానా కష్టం
అరెరే హుషారైన మజాలోన మతే చేడాలంతే
తమాషాగా తతంగాన తాలాడించాలంతే
చుట్టురా జనంతో రంగుల్లో హంగుల్లో
రేయంతా రెచ్చిపోవాలే (రెచ్చిపోవాలే )
దరువేయ్ రా ధన ధన ధన అందరూ తయ్యారన్న
లేదన్న తన మన ఈ క్షణాన
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కలన్న
ఆడుతు ఊగలన్న తెల్లారిన
దరువేయ్ రా ధన ధన ధన అందరూ తయ్యారన్న
లేదన్న తన మన ఈ క్షణాన
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కలన్న
ఆడుతు ఊగలన్న తెల్లారిన
_________________
సాంగ్ : రెచ్చిపోవాలే (Recchipovaale)
చిత్రం: బ్రహ్మా ఆనందం (Brahma Anandam)
సంగీతం: శాండిల్య పిసపాటి (Sandilya Pisapati)
లిరిసిస్ట్: శ్రీ సాయి కిరణ్ (Sri Sai Kiran)
గాయకులు: సాకేత్ కొమండూరి (Saketh Komanduri) & శాండిల్య పిసాపాటి (Sandilya Pisapati)
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచయిత & దర్శకుడు: Rvs నిఖిల్ (Rahul Yadav Nakka)
నటులు : రాజగౌతమ్ (Raja Goutham), బ్రహ్మానందం (Brahmanandam)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .