రాసుకున్నానమ్మా ఈ పాట నీ కోసమే
దాసుకున్న ప్రేమనంత నింపి అందులోనే
చూసుకుంటినమ్మా నిన్ను నా ప్రాణమోలే
చెప్పుకొని గుండె గాయమెంతో చేసినవే
కలనైనా నిన్ను వీడి దూరమై ఉండలేనోణ్ని
ప్రాణమే నువ్వని నమ్మి పిచ్చిగా బ్రతికే వాన్ని
రాసుకున్నానమ్మా ఈ పాట నీ కోసమే
దాసుకున్న ప్రేమనంత నింపి అందులోనే
చూసుకుంటినమ్మా నిన్ను నా ప్రాణమోలే
చెప్పుకొని గుండె గాయమెంతో చేసినవే
నువ్వు లేక నిమిషమే రోజు సచ్చి బతుకుతున్ననే
గుండెలోని బాధని తలచి కుమిలిపోతూ ఉన్ననే
గుర్తుకొస్తే రూపమే మరిచి ఉండలేకున్నానులే
ఊపిరాడనట్టుగా ప్రాణం అల్లాడిపోతున్నదే
రాసుకున్నానమ్మా ఈ పాట నీ కోసమే
దాసుకున్న ప్రేమనంత నింపి అందులోనే
చూసుకుంటినమ్మా నిన్ను నా ప్రాణమోలే
చెప్పుకొని గుండె గాయమెంతో చేసినవే
గువ్వ గోరికల్లాగా మనము జంటగుందమంటివే
ఒక్క గూటి పక్షుల్లా ఎప్పుడు కూడి ఉందమంటివే
ఆశ చూపి నువ్వలా మనసును ఎంత మాయ చేస్తివే
నిన్ను నమ్మినందుకే నాకు ఇంత శిక్ష ఎందుకే
తట్టుకోలేకున్నానమ్మా బాధ నాకెందుకే
చెప్పుకొని గుండె గాయమెంతో చేసినవే
కూసంతైనా జాలి లేదా నీకు ఎందుకనే
అమ్మలాంటి ప్రేమ బంధమెందుకల్లినవే
వెలుగు పంచె వెన్నెలే నువ్వని ఎంతో మురిసిపోతినే
వెన్నెల్లో నీకోసమే ఎనెన్నో కలలు నేను కంటినే
చివరిదాక వీడని నీడల నాతో ఉంటానంటివే
కమ్ముకున్న చీకట్లో వదిలేసి దూరమెళ్లితున్నవే
రాసుకున్నానమ్మా ఈ పాట నీ కోసమే
ఒక్కసారి నన్ను చేరి గుండెకత్తుకోవే
ఎదురు చూస్తూ ఉన్ననమ్మా నేను నీకోసమే
చివరిదాక ఏలు పట్టుకొని నడవలనే
___________
సాహిత్యం: అనిల్ చొప్పరి (ANIL CHOPPARI)
సంగీతం : మహి మధన్ MM (MAHI MADHAN MM)
మిక్సింగ్ & మాస్టరింగ్ :వికాస్ వర్మ (VIKAS VARMA)
గాయకుడు: రామ్ అద్నాన్ (RAM ADNAN)
దర్శకత్వం: కైలాన్ కింగ్ (KAYLAN KING)
నిర్మాత: శివరాత్రి శ్రవణ్ (SHIVARATHRI SRAVAN)
తారాగణం: నీతు క్వీన్ (NITHU QUEEN ), శ్రావణ్ (SRAVAN), శ్రీకాంత్ (SRIKANTH)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.