హేయ్.. రావు గారి అబ్బాయి
యాక్టర్ అవ్వాలన్నాడు
కానీ వాళ్ళ బాబేమో
డాక్టర్ నే చేసాడు
పైసలెన్నో వస్తున్నా
పేషెంట్ లా ఉంటాడు
సూపర్ స్టార్ అవ్వాల్సినోడు
సూది మందు గుచ్చుతున్నాడు
నీకు నచ్చింది చేయకుంటే
లైఫు లో యాడుంది కిక్కు
నిన్నే నువ్వు నమ్మకుంటే
నీకింకా ఎవడు దిక్కు
బీ వాట్స్ యూ వన్నా బె
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే
లేదంటే లైఫ్ అంత నరకం
(నిజమేరా ఎదో నిన్ను ఫాలో అవడం వల్ల ఇలా ఉన్నాను కాని
లేకపోతే ఆ లక్ష్మి గారి అమ్మాయిల లైఫ్ లో లైఫ్ ఏ లేకుండా పోయేదిరా బాబూ )
హేయ్.. ఆ లక్ష్మి గారి అమ్మాయి
(బావుంటదా ? ముందు మ్యాటర్ వినరా సన్నాసి )
ఆ లక్ష్మి గారి అమ్మాయి
డాన్సర్ అవ్వాలనుకుంది
కానీ వాళ్ల అమ్మేమో
పెళ్లి చేసి పంపేసింది
వంద కోట్ల ఆస్తున్న
వంటింట్లోనే వుంటాది
గజ్జ కట్టాలనుకున్నది
గరిట పట్టుకున్నాధీ
ఎవడో చెప్పింది చేస్తుంటే
లైఫు లో ఏడుంది కిక్కు
ఎపుడు నువ్వే సర్దుకు పోతే
నీకింకా ఎవడు దిక్కు
బి వాట్స్ యూ వన్నా బి
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే లేదంటే లైఫ్ అంత నరకం
(మన జనరేషనే కాదురా మన ముందు జనరేషన్ కి కూడా ఇదే టార్చర్
అంతెందుకు మన శీను గాడి బాబాయ్ )
శీను గాడి బాబాయి
లీడర్ అవ్వాలన్నాడు
కానీ వీడి తాతేమో
ప్లీడర్ ని చేసాడు
కేసు వాడివైపున్న
పేస్ మాడినట్టుంటాడు
జిందాబాద్ వినాల్సినోడు
జడ్జి ముందు తలవంచాడు
నువ్వనుకున్నది చెప్పకుంటే
లైఫు లో యాడుంది కిక్కు
నీలో నువ్వే గింజుకుంటే నీకింక ఎవడు దిక్కు
బి వాట్స్ యూ వన్నా బి
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే లేదంటే లైఫ్ అంత నరకం
రేయ్
పెద్దవాళ్ళు చెబుతారు
పక్క నోళ్లు చెబుతారు
తప్పులేదు బాసు
వాళ్లకు తోచిందే చెబుతారు
నువ్వు కోరుకుందేంటో
నీకు ఏది సూట్ అవుతుందో
అర్థమయ్యేలా చెప్పకుంటే
వాళ్ళు మాత్రం ఎం చేస్తారు
ఏయ్
మనమే క్లియర్ లేకపోతే
అక్కడే వస్తుంది చిక్కు
లేనిపోని భయాలు పెట్టుకుంటే
తర్వాత మీకు దిక్కు
బి వాట్స్ యూ వన్నా బి
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే లేదంటే లైఫ్ అంత నరకం
చిత్రం: మిస్టర్ పర్ఫెక్ట్ ( Mr Perfect)
పాట పేరు: రావు గారి అబ్బాయి (Rao Gari Abbai)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు:టిప్పు (Tippu), మేఘా (Megha)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: దశరధ్ (Dasaradh)
నింగి జారిపడ్డ సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి