Home » రంగుల పల్లకి దారుల్లో (Rangula pallaki darullo) సాంగ్ లిరిక్స్ – Folk Song 

రంగుల పల్లకి దారుల్లో (Rangula pallaki darullo) సాంగ్ లిరిక్స్ – Folk Song 

by Lakshmi Guradasi
0 comments
Rangula pallaki darullo song lyrics Folk

రంగుల పల్లకి దారుల్లో
నింగిలో వెన్నెల నీడల్లో
నిన్నే చుసాలే పిల్ల

సల్లని మబ్బుల తోవల్లో
సింగిడి ముగ్గుల విధుల్లో
అల్లరి చెయ్యకు ఓ బావ

పందిరి మల్లెల మొగ్గలు
నీ పాల బుగ్గల సిగ్గులు
తెల్లని తమర పువ్వులు
నీ తీరం దాటని నవ్వులు

చూడవే రంగుల బంగారి
సింగరాల సూపుల్లా

మందార గంధపు తోటలు
నీ మాయలు కమ్మిన మాటలు
అత్తరి సెంటుల సూపులు
నువ్వు అల్లకు నా మీద ప్రేమలు

సుక్కల దావాలో చందురూడ
సూపులకందని పిల్లను రా

రంగుల పల్లకి దారుల్లో
నింగిలో వెన్నెల నీడల్లో
నిన్నే చుసాలే పిల్ల

వేసవి కాలం ఎండల్లో
శీతాకాలం గుండెల్లో
నీతోడుంటాలే పిల్ల

నీళ్లపు సంద్రాల పొంగుల్లో
నిదుర లేసిన ప్రేమల్లో
హద్దులు దాటకురో ఓ బావ

పైరు జొన్నల గువ్వలు
నీ రవ్వల జుంకిలా మువ్వలు
పంచ వన్నెల గాజులు
నేను ఎన్నడూ చూడని మోజులు

గళ్ళు గళ్ళునా ఎళ్లిపోకే
గావురాల నెమలి పిల్ల

తూనీగ తుమ్మెద వలపులు
నీ తేనెలు జల్లిన ఉరుకులు
సాలు సలుకుండే సైగలు
ఆ పద్ధుతు ఎలా నిందలు

తూర్పు కొండల్లో సూరిడా
గారడీ బుద్దులు నీకెలా

రంగుల పల్లకి దారుల్లో
నింగిలో వెన్నెల నీడల్లో
నిన్నే చుసాలే పిల్ల

పక్షులకందని దురాల్లో
వేగు చుక్కల తీరాల్లో
జంటై కుడుదామె పిల్ల

మక్కువ రేపిన ఆశల్లో
మోహపు మొగ్గుల ఊహల్లో
తేలిపోకురా ఓ బావ

పున్నమి వన్నెల మిన్నులు
నీ నల్లని కట్టుక కన్నులు
పల్లేరు గాయాల సూపులు
అవి అల్లరి ముద్దుల ప్రేమలు

ఎర్ర తోలు చిన్నదాన
వయ్యారాల లేడి కూన

దాగుడుమూతల ఆటలు
నీ మయాధారి ప్రేమ ఊటలు
పరువు గల్లా ఆడపిల్లను
నేను పల్లెటూరి చందమామ ను

మందులు లేని మయల్లోన
ముంచామకూరా పిల్లగాడ

రంగుల పల్లకి దారుల్లో
నింగిలో వెన్నెల నీడల్లో
నిన్నే చుసాలే పిల్ల

ఉరుముల మెరుపుల వానల్లో
వెన్నెల సూడని వేళల్లో
అల్లుకుపోదామే పిల్ల

జాజిరి సందెల పొద్దుల్లో
చీకటి మన్మధ ముద్దుల్లో
మద్దతు నీకేరో బావ

దీపాల పండుగ వెలుగులు
మన పెళ్ళికి పెట్టిన గడియలు
వెంటరావే ఏడు అడుగులు
నిన్ను ఏలుకుంటా ఏడు జన్మలు

పైడి వన్నెల చందమామ
ప్రాణాలన్నీ నీ మీదే

వెండి బంగారాల మూటలు
నీ ముద్దుల మురిపాల మాటలు
గెలిచినావు పిల్ల ప్రేమలు
నీ కూడా ఉంట వెయ్యి జన్మలు

రామసక్కని చిన్నవాడా
రంగుల బొమ్మ నీదేలేరా

రంగుల పల్లకి దారుల్లో
నింగిలో వెన్నెల నీడల్లో
నిన్నే చుసాలే పిల్ల

__________________________________________

పాట: రంగుల పల్లకి దారుల్లో (Rangula pallaki darullo)
నిర్మాత – జైపాల్
హీరో – ప్రసాద్ PR (Prasad PR)
హీరోయిన్ – లాస్య స్మైలీ (Lasya Smily)
సాహిత్యం – మహేందర్ ముల్కల (Mahendar Mulkala) (సెలయేళ్లు ఫేమ్)
గాయకుడు – సుమన్ బద్నకల్ (Suman Badnakal) – శ్రీనిధి (Srinidhi)
సంగీతం -వెంకట్ అజ్మీరా (Venkat Ajmera)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.