రాముడంటి గుణము గల్లవాడే
చీమకైన హాని చెయ్యనోడే
నీ మీదే పాణాలు పెట్టుకుంటే
చంటి పిల్లొడై ఏడుస్తుండే
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు గాదే
నా మనసులున్న మాటే నీతో చెప్పుకోలే తప్పు నాదే
నీ వెనుకేనుక నే తిరిగినానే
నీ ముందుకొచ్చే ధైర్యమంటూ లేదే
నీకై మొక్కులెన్నో మొక్కినానే
మోకాళ్లపై నడిచి నిన్ను కోరినానే
ఇంతలోనే నా సోపతోడే
అన్ని తెలిసి నన్నెట్లా మోసగించిండే…
పస్తులు ఉంటూ మొక్కినాడే
పుస్తెను కడదామనుకున్నాడే
అలివి అవుతావనుకున్నాడే
ఆశలు మట్టి పాలయేనే
పస్తులు ఉంటూ మొక్కినాడే
పుస్తెను కడదామనుకున్నాడే
అలివి అవుతావనుకున్నాడే
ఆశలు మట్టి పాలయేనే
నే కొన్న పుస్తకంలో ప్రతి పేజీ నీతోనే నింపుకున్నా
నీతోని చెప్పుకోక చెత్తలో చిత్తు కాగితమైన
నవ్వుతుండాలని సమ్మక్క ముడుపునే కట్టుకున్నా
ఆ నవ్వు చూడాలనే నీ ముందు జోకరు బొమ్మైనా
గుక్క పట్టినా గుండె పగిలినా నిన్ను తిట్టుకోనే మైన
అన్ని తెలిసినా పక్కనున్నోడే నీ పక్కనే కోరుకున్నా
గుక్క పట్టినా గుండె పగిలినా నిన్ను తిట్టుకోనే మైన
అన్ని తెలిసినా పక్కనున్నోడే నీ పక్కనే కోరుకున్నా
మనసులున్న బాధ మింగుకుంటా
నేను నీ సుఖము కోరి దూరం అవుతున్నా
పస్తులు ఉంటూ మొక్కిననే
పుస్తెను కడదామనుకున్నానే
అలివి అవుతావనుకున్నానా
ఆశలు మట్టి పాలయేనే
పస్తులు ఉంటూ మొక్కిననే
పుస్తెను కడదామనుకున్నానే
అలివి అవుతావనుకున్నానా
ఆశలు మట్టి పాలయేనే
విడిచున్న కన్నులే కన్నీళ్లతో మసకబారినయే
ఇక నిన్ను పిలవననే బెంగతో నా గొంతు మూగబోయే
ఏ పాపము చేస్తినో పైవాడు నాపై కక్ష కట్టే
ప్రేమనే పాశాన్ని నాపై విసిరి ప్రాణాలు తీస్తున్నాడే
ఓడిపోయినా అలిసిపోయినా చావు చివరంచు చేరుతున్న
మళ్ళి జన్మంటూ రాసి పెట్టుంటే నీకు నా ప్రేమే చెప్పుకొనా
ఓడిపోయినా అలిసిపోయినా చావు చివరంచు చేరుతున్న
మళ్ళి జన్మంటూ రాసి పెట్టుంటే నీకు నా ప్రేమే చెప్పుకొనా
నూరేళ్ల జీవితమే మిగిలివున్న గాని
పాతికేళ్లకే పాడెను ఎక్కుతున్న..
పస్తులు ఉంటూ మొక్కిననే
పుస్తెను కడదామనుకున్నానే
అలివి అవుతావనుకున్నానా
ఆశలు మట్టి పాలయేనే
పస్తులు ఉంటూ మొక్కిననే
పుస్తెను కడదామనుకున్నానే
అలివి అవుతావనుకున్నానా
ఆశలు మట్టి పాలయేనే
Song Credits:
సంగీతం: ఇంద్రజిత్ (Indrajith)
గానం: దిలీప్ దేవగన్ (Dilip Devagan) & వాగ్ధేవి టీమ్ (Vagdhevi Team) (Baby Fame)
నిర్మాతలు: చందు గొడ్డాటి (Chandu Goddati), మల్లేష్ పులి (Mallesh Puli)
దర్శకత్వం: పోతరాజు శ్రీకాంత్ (Potharaju Srikanth)
నటీనటులు: ఆశ్రిత హనీ (Asritha Honey). గడ్డం రాజు (Gaddam Raju) & జయ్యారపు సందీప్ (Jayyarapu Sandeep)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.